అల్లు అర్జున్ కన్నా అతనే బెస్ట్ డాన్సర్.. నటుడు శ్యామ్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కికేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి.పుష్ప సినిమా విడుదలకు ముందు వరకు ఈయన దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే పుష్ప సినిమా అనంతరం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ కు ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు.

ఇలా అల్లు అర్జున్ తన సినిమాలలో అద్భుతమైన మాస్ స్టెప్పులతో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటారు. అయితే తాజాగా రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ అన్నయ్యగా నటించిన శ్యామ్ ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ డాన్స్ గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు అల్లు అర్జున్ విజయ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రశ్న ఎదురయింది. వీరిద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అంటూ ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తన దృష్టిలో అల్లు అర్జున్ కన్నా విజయ్ బెస్ట్ డాన్సర్ అంటూ సమాధానం చెప్పారు.

ఇక ఈ విషయాన్ని అల్లు అర్జున్ కూడా స్వయంగా ఒప్పుకుంటారని ఈయన తెలిపారు. విజయ్ డాన్స్ చేస్తే చాలా నేచురల్ గా సింపుల్ గా ఉంటుంది. కానీ అల్లు అర్జున్ ఒక పాటకు డాన్స్ చేయాలంటే పెద్ద ఎత్తున రిహార్సల్స్ చేస్తారంటూ ఈయన వెల్లడించారు.తాను రేసుగుర్రం సినిమాలో నటించే సమయంలో అల్లు అర్జున్ ఆ సినిమాలో పాటలకు పదే పదే స్టెప్పులను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారని ఈ సందర్భంగా శ్యామ్ అల్లు అర్జున్ డాన్స్ గురించి చేసినటువంటి ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.