గెటప్ శ్రీను రీ ఎంట్రీతో జబర్దస్త్ రేటింగ్ పెరిగిందా.. రీ ఎంట్రీ కలిసి వచ్చిందా?

జబర్దస్త్ కార్యక్రమం నుంచి సుడిగాలి సుదీర్ హైపర్ ఆది గెటప్ శ్రీను బయటకు వెళ్లడంతో ఈ కార్యక్రమ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ కమెడియన్స్ కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లడం వల్ల జబర్దస్త్ కార్యక్రమాన్ని చూడటానికి ప్రేక్షకులు సైతం ఇష్టపడటం లేదు.అదేవిధంగా ఈ కార్యక్రమ రేటింగ్స్ కూడా దారుణంగా పడిపోవడంతో అలర్ట్ అయినా నిర్వాహకులు వెంటనే వీరితో సంప్రదింపులు జరిపి ఒక్కొక్కరిని ఈ కార్యక్రమంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ టీం లో చేస్తున్నటువంటి గెటప్ శ్రీను పలు సినిమా అవకాశాల కారణంగా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లారు.అయితే గత రెండు ఎపిసోడ్ల నుంచి గెటప్ శ్రీను ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.ఈ విధంగా ఈయన ఈ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం ఇదొక్క ఎపిసోడ్లో మాత్రమే ఈయన ఉంటారని చాలామంది సందేహం వ్యక్తం చేసినప్పటికీ ఈయన తరువాత ఎపిసోడ్ లో కూడా సందడి చేశారు.

ఎట్టకేలకు జబర్దస్త్ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇచ్చిన గెటప్ శ్రీను యధావిధిగా తన గెటప్స్ తో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే ఈయన తిరిగి రావడంతో ఈ కార్యక్రమానికి ఏమైనా లాభం ఉందా అంటే ఉందనే నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం గెటప్ శీను రీఎంట్రీ ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమ రేటింగ్స్ పెరిగాయని అలాగే యూట్యూబ్ లో గెటప్ శ్రీను స్కిట్ చేసే వారి సంఖ్య కూడా పెరిగిందని తెలుస్తోంది. ఈ విధంగా ఈ కార్యక్రమ రేటింగ్స్ పెరగడంతో జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి పూర్వ వైభవం వచ్చిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.