జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణం లో… క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా G.O.A.T మూవీ షూటింగ్ పూర్తి చేశారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకున్నాయి.
సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, తను నిర్మించిన సినిమాలలో మంచి చిత్రం గా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాత మొగుళ్ళ చంద్రశేఖర్ తెలియజేశారు.

త్వరలోనే టీజర్, పాటలు అన్నీ అప్డేట్స్ తో… ముందుకు రాబోతున్నారు.
నటీనటులు: సుడిగాలి సుధీర్, దివ్యభారతి, మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వి, అడుకులం నరైన్, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని
బ్యానర్: జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్
నిర్మాత: మొగుళ్ళ చంద్రశేఖర్
పీఆర్వో: తేజస్వి సజ్జా

