GOAT Movie: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ

GOAT Movie: జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో… క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా మూవీ G.O.A.T . ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకి చేరుకుంది.

ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లియోన్ జేమ్స్ ఈ పాటని అదిరిపోయే లవ్ మెలోడీ గా కంపోజ్ చేశారు. సుధీర్ బాబు కెరీర్‌లో ఇంత వేగంగా వైరల్ అయిన పాట ఇదే అనే చెప్పాలి. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోయి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలు హిట్ అంటూ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన అందుకుంటున్నాయి. దీంతో సినిమా పై బజ్ మరింతగా పెరిగింది.

ఇక తాజాగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ కోసం మెలోడి బ్రహ్మ మణిశర్మ టీంలో చేరడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా ఎంతో బాగా వచ్చిందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుపుతున్నారు.

నటీనటులు: సుడిగాలి సుధీర్, దివ్యభారతి, మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వి, అడుకులం నరైన్, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని

బ్యానర్: జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్
నిర్మాత: మొగుళ్ళ చంద్రశేఖర్
మ్యూజిక్: లియోన్ జేమ్స్
బీజీఎం: మణిశర్మ
పీఆర్వో: తేజస్వి సజ్జా

అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ | Analyst Chinta Rajasekhar About Amaravathi Land Pooling | TR