Home News సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన గ్యాంగ్ లీడర్ బ్యూటీ..?

సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన గ్యాంగ్ లీడర్ బ్యూటీ..?

సూర్య రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్నాడు. సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సస్ ని అందుకుంది. సూర్య గత చిత్రాలు బందోబస్త్, ఎన్.జీ.కె సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దాంతో ఆకాశం నీ హద్దురా సినిమా మీద ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఊహించని విధంగా ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ ని సాధించింది. తాజాగా బుల్లితెరమీద కూడా ఈ సినిమా మంచి రేటింగ్ ని సాధించింది.

94C7Ffff46A0969033Eac4Db5Db04Fd9D4A7B024008F29058Ba9858Fa6742Cd7 | Telugu Rajyam

కాగా సూర్య నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం సూర్య ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పాండి రాజన్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా సూర్య కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందని సూర్య అభిమానులు చెప్పుకుంటున్నారు. అందుకు కారణం పాండి రాజన్ దర్శకత్వంలో తెరకెక్కే కథలు గొప్పగా ఉండటమే. నేషనల్ అవార్డ్ ని అందుకున్న దర్శకుడు. అందుకే సూర్య – పాండి రాజన్ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

79143745 | Telugu Rajyam

కాగా ఈ సినిమాలో లక్కీ ఛాన్స్ అందుకుందట గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. నేచురల్ స్టార్ నాని – విక్రం కె కుమార్ కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయిన ప్రియాంక అరుల్ మోహన్ మొదటి సినిమాతోనే టాలీవుడ్ మేకర్స్ ని ఆకట్టుకుంది. ప్రస్తుతం శర్వానంద్ తో శ్రీకారం అన్న సినిమా చేస్తున్న ప్రియాంక అరుల్ కి నాగ చైతన్య కి జంటగా నటించే అవకాశం దక్కిందని అంటున్నారు. ఈలోపే సూర్య – పాండి రాజన్ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ అందుకుందట. ఈ సినిమా గనక హిట్ అయితే ఇక ప్రియాంక అరుల్ కి కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేసినట్టే అంటున్నారు.

- Advertisement -

Related Posts

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అంటూ జగన్ మీద లోకేష్ సెటైర్లు

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ హై కోర్ట్ ఉత్తర్వులివ్వటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే దాదాపు పట్టణ జనాభా అధికంగా ఉండేవే...

మంత్రులు ఇరుక్కుంటున్నారా లేక ఎవరైనా ఇరికిస్తున్నారా ?

వైసీపీ మంత్రులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు హైలెట్ అవుతూ ఉంటారు.  సీజన్ ప్రకారం ఈ టైమ్ ఒకరు ఈ టైమ్ ఇంకొకరు అంటూ వార్తలూ నిలుస్తూ వస్తున్నారు. టైం టేబుల్ వేసుకున్నట్టు ఒక్కొక్కరిగా వార్తలకెక్కుతున్న...

Latest News