‘జవాన్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుంది. ఈ ఏడాది పఠాన్ తో దిమ్మతిరిగేలా కం బ్యాక్ ఇచ్చిన షారుక్ ఖాన్. ఆసినిమా తో వేయి కోట్ల కలెక్షన్స్ సాధించాడు. ఇక ఇప్పుడు జవాన్ అంతకు మించి కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది.
ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ తోపాటు నయనతార, ప్రియమణి, సన్యా మల్హోత్రా, విజయ్ సేతుపతి , దీపికా పదుకొణె లాంటి స్టార్ కాస్ట్ నటించారు. ఈ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటించాగా.. దీపికాపదుకునే అతిథి పాత్రలో కనిపించింది. జవాన్ లో ఆమె నటించింది తక్కువే సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది. అయితే దీపికా ఈ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్ నడుస్తుంది.
‘జవాన్’ లో నటించేందుకు దీపికా పదుకొణె రూ.15 కోట్లు తీసుకున్నట్లు ఇటీవల పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలను దీపిక ఖండిరచింది. ఈ సినిమాకు పారితోషికం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. జవాన్ కు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని అందుకు కారణాన్ని కూడా తెలిపింది. భారత్ వరల్డ్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘83’ లో దీపికా అతిథి పాత్రలో నటించింది. ఈ సినిమాలో కపిల్ దేవ్ గా దీపికా భర్త రణవీర్ సింగ్ నటించాడు. ఈ సినిమాలో నటించినందుకు దీపికా రెమ్యునరేషన్ తీసుకోలేదు. దీనికి కారణం కూడా చెప్పింది.
దీపికా మాట్లాడుతూ.. నేను 83 లో భాగం కావాలనుకున్నాను. భర్త సక్సెస్‌లో భాగమయ్యే భార్య పాత్రలో నటించడం నాకు బాగా నచ్చింది. దాని కోసం నేను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు అని తెలిపింది. అదే విధంగా షారుక్ ఖాన్, రోహిత్ శెట్టిలకు కూడా పారితోషికం తీసుకోకుండా గెస్ట్ రోల్స్ చేస్తాను’ అని దీపిక తెలిపింది.
దీపికా పదుకొణె, షారుక్ ఖాన్ ది హిట్ కాంబినేషన్. ‘ఓం శాంతి ఓం’ లో షారుక్- దీపిక కలిసి నటించారు. 2013లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లో దీపిన హీరోయిన్ గా నటించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్’ లో షారుక్-దీపిక కలిసి నటించారు. ఈ ఏడాది వచ్చిన పఠాన్ లోనూ దీపికా షారుక్ కలిసి నటించారు. షారుక్ పై ఉన్న అభిమానంతోనే జవాన్ లో రెమ్యునరేషన్ తీసుకోకుండా చేశాను అని తెలిపింది దీపికా.