Yash’s Toxic: రాకింగ్ స్టార్ య‌ష్ ‘టాక్సిక్’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

Yash’s Toxic: రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా నుంచి వ‌స్తోన్న క్రేజీ అప్‌డేట్స్‌తో అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతూ వ‌స్తున్నాయి. తాజాగా ఈ భారీ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ ను మెలిస్సా పాత్రలో పరిచయం చేస్తూ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ మంగ‌ళ‌వారం రోజున రిలీజ్ చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తుంటే ఆమె అందంగా, అధికారంతో, ఎలాంటి భయం లేకుండా కనిపించనుందనే పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌నే విష‌యం తెలుస్తోంది.

య‌ష్‌, గీతూ మోహన్ దాస్ కాంబో అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అంద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు య‌ష్‌తో క‌లిసి రుక్మిణి వ‌సంత్ న‌టించ‌టంతో ఇదింకా ప్ర‌త్యేక‌తంగా అనిపిస్తోంది. డైరెక్ట‌ర్ గీతు క‌థలో చెప్పాల‌నుకున్న డెప్త్, సీరియ‌స్‌నెస్ అర్థం చేసుకుని త‌న‌దైన న‌ట‌న‌తో భావోద్వేగాల‌ను అద్బుతంగా ప‌లికించేలా స‌హ‌జంగా ఒదిగిపోయే న‌టి రుక్మిణి. అలాగే అంత‌ర్జాతీయ స్థాయిలో నిలిచిపోయేలా ఓ ఇండియ‌న్ సినిమా చేయాల‌నే య‌ష్ ఆశ‌యం కూడా ఇందులో ప్ర‌తిబింబిస్తుంది.

నాడియాగా కియారా అద్వానీ, ఎలిజిబెత్ పాత్ర‌లో హుమా ఖురేషి, గంగ రోల్‌లో న‌య‌న‌తార‌, రెబెకా క్యారెక్ట‌ర్‌లో తారా సుతారియా న‌టిస్తున్నారు. వీరి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌ విడుద‌ల త‌ర్వాత ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి మెల్లిసా పాత్ర‌లోని రుక్మిణి వ‌సంత్‌ను ప‌రిచ‌యం చేయ‌టం చూస్తే ఈ క‌థాప్ర‌పంచం మ‌రింత డెప్త్‌గా ఉంద‌నే విష‌యం తెలుస్తుంది. 1960 చివ‌ర‌లోజ‌రిగే రంగుల ప్ర‌పంచంలో త‌క్కువ వెలుతురుండే ప్ర‌దేశంలో జ‌రుగుతున్న పార్టీ నేప‌థ్యంలో ఈ సన్నివేశం ఉంటుంది. మెల్లిసా పాత్ర ఆత్మ‌విశ్వాసంతో ఉంటుంది. ఆమె చూపులో ఓ తీక్ష‌ణ‌త‌ను చూడొచ్చు. ఆమె చుట్టూ ఉన్న ప్ర‌పంచం ప‌క్క‌నున్న వారిని ప‌ట్టించుకోకుండా తేలిపోతుంటే, మెల్లిసా మాత్రం త‌న ల‌క్ష్యం వైపు చాలా స్ప‌ష్టంగా అడుగులేస్తుంటుంది. అక్క‌డున్న వారంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఆమె న‌డ‌క ఉంది. ఇది ఎంత బావుంటుందంటే.. ఆ ప్ర‌దేశమంతా ఆమె ఆధీనంలోనే ఉన్నంత‌గా.

సినిమాలోని ప్ర‌తి పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌టం ద్వారా సినిమా బావోద్వేగాల ప‌రిధి, సినిమాటిక్ స్థాయిని టాక్సిక్ విస్తరిస్తోంది. అందువ‌ల్ల ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో త‌న స్థానాన్ని నిలుపుకుంది.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ మాట్లాడుతూ ‘‘రుక్మిణిలో నాకు నచ్చే విషయమేమంటే.. నటిగా డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలని ఆలోచించే వ్య‌క్తి కాదు. చాలా తెలివైన‌ది. పాత్ర‌ను అర్థం చేసుకుంటుంది. పాత్ర గురించి ఆమె వేసే ప్ర‌శ్న‌లు చాలా ఆస‌క్తిని క‌లిగిస్తాయి. డైరెక్ట‌ర్‌గా అవి న‌న్నెంతో ఆలోచింప‌చేశాయి. కొన్ని సంద‌ర్భాల్లో నా నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించుకునేలా చేశాయి. ఆమె న‌టిస్తున్న‌ప్పుడు స్క్రీన్‌ను చూస్తే ఆమె ఎంత తెలివైన‌ది.. మ‌నం చెప్ప‌ని విష‌యాల‌ను కూడా ఇంప్రవైజ్ చేసి చెబుతుంద‌నిపిస్తుంది. షూటింగ్ షాట్స్ గ్యాప్‌లో ఆమె నిశ్శబ్దంగా తన జర్నల్‌లో రాసుకోవ‌టాన్ని నేను చాలా సార్లు చూశాను. సెట్‌లో జరిగిన చిన్న సంఘటనలు, తన ఆలోచనలను ఆమె అందులో రాసుకుంటుంటుంది. ఇదే ఆమె యాక్టింగ్ వెనుకున్న ర‌హ‌స్య‌మ‌ని తెలుస్తుంది. ఆమె త‌న‌తో తాను ఓ లోకాన్ని నిర్మించుకుంటూ ఉంటుంది. ఆమె ప‌ని చేసే తీరు ఆలోచ‌నాత్మ‌కంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె జ‌ర్న‌ల్‌లో పేజీలను మ‌నం ఒక్క‌సారి చ‌దివితే బావుండేద‌నిపిస్తుంది. ఎందుకంటే ఆమె న‌ట‌న‌లోని డెప్త్.. ఆపాత్ర వెనుకున్న భావాన్ని అర్థం చేసుకోవాల‌నే ఆస‌క్తి అందులోనుంచి వ‌చ్చిందే’’ అన్నారు.

యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచ‌నాలున్నాయి. అద్భుత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వ‌ర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నేషనల్ అవార్డు గ్రహీత రాజీవ్ రవి నిర్వహిస్తుండగా.. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ చూసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తో పాటు నేషనల్ అవార్డు గెలుచుకున్న అన్బరివ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేశారు.

‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ నిర్మిస్తున్నారు. సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్‌ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

అనసూయకు రాశి దెబ్బ || Cine Critic Dasari Vignan Reacts On Actress Raasi Counter to Anasuya || TR