Ram Gopal Verma: ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వ్యూహం’ సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.
దీంతో మద్దిపాడులో ఐటీ చట్టం కింద రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. కాగా చంద్రబాబు, పవన్, లోకేశ్ పై అనుచిత పోస్టులు పెట్టిన పలువురు వైసీపీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్టులు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.