తెలుగు సినిమా దగ్గర ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి టాప్ దర్శకుల్లో ఒకడైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాగా తాను తన డౌన్ ఫాల్ కి తానే కారణం అయ్యాడు. మరి ఇప్పుడు ఆల్ మోస్ట్ అన్నీ బి గ్రేడ్ కంటే తక్కువ ఎవరు తనకి ఫైనాన్సియల్ గా సపోర్ట్ చేస్తే వారికే సపోర్ట్ గా సినిమాలు చేస్తున్నట్టుగా వర్మ మారిపోయాడు.
అలా గత ఎన్నికల నుంచి ఇప్పుడు ఎన్నికల వరకు కూడా తాను చేస్తున్న సినిమాలు పలు కాంట్రవర్సీలకి దారి తీయగా ఇప్పుడు తాను చేసిన సినిమా “వ్యూహం” తో ఏదో చేద్దాం అనుకుంటున్నాడు కానీ వర్మకి వరుస షాక్ లు ఇప్పుడు తగులుతున్నాయి.
నిజానికి గత నవంబర్ లో థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోర్ట్ కేసులు సెన్సార్ సమస్యలతో రిలీజ్ నిలిచిపోయింది. సరే ఈ డిసెంబర్ 29న రిలీజ్ చేస్తామని ఏపీలో అధికార పార్టీ నుంచి పలువురు రాజకీయ నాయకులతో ప్రీ రిలీజ్ కూడా చేసి ఈసారి రిలీజ్ చేసేస్తామని తెలిపారు.
కానీ ఇవాళ డిసెంబర్ 29 సీన్ కట్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అవ్వలేదు. దీనితో మళ్ళీ వర్మకి షాక్ తగిలింది అని చెప్పాలి. పాపం తాను తన సినిమాతో ఏదేదో చేద్దాం ఎవరెవరినో గిచ్చుదాం అనుకున్న వర్మ చివరికి ఇలా నిస్సహాయుడిగా మారిపోయాడు. మరి డైరెక్ట్ గా యూట్యూబ్ లో ఏమన్నా సినిమా రిలీజ్ చేసుకుంటాడేమో చూడాలి.