Anchor shyamala: వైకాపా పార్టీకి నిత్యం ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఎంతో మంది కీలక నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాలలో ఏమాత్రం పాల్గొనడం లేదు. మరి కొంతమంది నేతలు వైసీపీకీ గుడ్ బై చెబుతూ ఇతర పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు.
ఇలా ఎవరికివారు జగన్మోహన్ రెడ్డికి ఊహించని విధంగా షాక్ ఇస్తూ వైకాపా పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆర్టిస్టులు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి దూరంగా ఉంటున్నారు. గతంలో అలీ కూడా తాను ఏ రాజకీయ పార్టీలకు మద్దతు తెలపనని పూర్తిగా రాజకీయాలకు శాశ్వతంగా ఉంటున్నానని తెలియజేశారు. ఇటీవల పోసాని కృష్ణమురళి అలాగే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా వైకాపా కార్యకలాపాలకు అలాగే పార్టీ వ్యవహారాలకు కూడా దూరంగా ఉన్నామని ప్రకటించారు.
ఇక పోసాని కృష్ణ మురళి తాను ఇకపై ఏ రాజకీయాలలోకి వెళ్ళనని ఏ రాజకీయ పార్టీలకు మద్దతు తెలపనని తెలియజేశారు. ఇలా ఒక్కొక్కరిగా వైకాపాకు సినీ గ్లామర్ దూరం అవుతూ వస్తున్న నేపథ్యంలో ఇకపై ఎవరూ కూడా ఈ పార్టీలోకి అడుగు పెట్టరనే తెలుస్తుంది ఇక సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా నటిగా కొనసాగిన శ్యామల మాత్రమే ప్రస్తుతం ఈ పార్టీలో కొనసాగుతున్నారు అయితే ఈమెపై వస్తున్నటువంటి విమర్శలు కనుక చూస్తే నేడో రేపో ఈమె కూడా ఈ పార్టీకి పూర్తిగా గుడ్ బై చెబుతూ కేవలం ఇండస్ట్రీలోనే కొనసాగుతారని తెలుస్తోంది.
యాంకర్ శ్యామల గత ఏపీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలియజేస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఈమె పవన్ గురించి అలాగే చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఇక ఊహించని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో యాంకర్ శ్యామలకు సినిమా అవకాశాలు కూడా లేకుండా పోయాయి దీంతో ఈమె వైకాపా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు అయినప్పటికీ ఈమెపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈమె కూడా ఎక్కువ కాలం పాటు రాజకీయాలలో కొనసాగలేరని, త్వరలోనే రాజకీయాలకు శాశ్వతంగా దూరం కాబోతున్నారని తెలుస్తోంది.