బాక్సాఫీస్ : 100 కోట్లకి దగ్గరలో “దసరా”..బాంచెత్.!

Dasara-Still-7-1024x576

కొందరి హీరోల మార్కెట్ ఒక్కసారిగా ఒక్క సినిమాతో ఓ రేంజ్ లో అయితే మారిపోతాయి. మరి సరిగా అలాంటి సినిమాగా వచ్చిన లేటెస్ట్ సినిమానే “దసరా”. నాచురల్ స్టార్ నాని కెరీర్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా మాస్ హిట్ అయ్యి భారీ వసూళ్లు నమోదు చేసింది.

మరి మొదటి 4 రోజుల్లోనే ఏకంగా 80 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టేసిన ఈ సినిమా ఇప్పుడు 5 రోజుల్లో అయితే వరల్డ్ వైడ్ మరో భారీ మార్క్ కి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఈ భారీ సినిమా అయితే ఈ 5 రోజుల్లో ఏకంగా 92కోట్ల గ్రాస్ ని అందుకొని 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తుంది.

అంతే కాకుండా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ అయితే నాని కెరీర్ లో మొదటి 100 కోట్ల గ్రాసర్ గా మాత్రమే కాకుండా ఫాస్టెస్ట్ 100 కోట్ల సినిమాగా ఇపుడు నిలుస్తుంది. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో అయితే కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అయితే తెరకెక్కించగా భారీ స్థాయిలో ఈ సినిమా హిట్ అయ్యి సెన్సేషన్ హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమాకి అయితే సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఈ సినిమా సక్సెస్ తో నిర్మాత సుధాకర్ చెరుకూరి దర్శకుడుకి కాస్ట్లీ కార్ ని గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా తమ చిత్ర యూనిట్ కోర్ టీం కి అయితే ఒకొక్కరకి 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ అయితే గిఫ్ట్స్ గా అందించారు.