బాక్సాఫీస్ : “దసరా” 3డేస్ వరల్డ్ వైడ్ వసూళ్లు.!

Dasara-Still-7-1024x576

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర హాట్ టాపిక్ గా మారిన వన్ అండ్ ఓన్లీ సినిమా పేరు “దసరా”. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రం భారీ హైప్ నడుమ ఈ నవమి కానుకగా అయితే రిలీజ్ అయ్యి తన కెరీర్ లోనే రికార్డు ఓపెనర్ గా నిలిచి దుమ్ము లేపింది.

మరి మొదటి రోజే ఈ సినిమా 38 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టగా రెండు రోజుల్లో అయితే ఈజీగా 50 కోట్లు దాటేసింది. అయితే రెండో రోజు వర్కింగ్ డే కావడంతో కాస్త స్లో అయ్యింది. కానీ మూడోరోజు వీకెండ్ కావడంతో రెండో రోజు కన్నా భారీ స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యాయి.

దీనితో మూడు రోజుల్లో ఈ సినిమా 71 కోట్ల గ్రాస్ కి చేరుకొని మరో రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ని టచ్ చేసేస్తోంది ఏమో అనే రేంజ్ కి వచ్చేసింది. కాగా ఈ సినిమా అయితే మూడో రోజు ఏపీ నైజాం లో అయితే 6.7 కోట్లు షేర్ రాబట్టినట్టుగా తెలుస్తుంది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో దసరా రికార్డు వసూళ్లు నమోదు చేస్తుండగా ఇక యూఎస్ లో అయితే ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్స్ దగ్గరకి చేరుకుంది.

దీనితో ఈ సినిమా అనుకున్న దాని కన్నా ఎక్కువ అంచనాలు దాటి బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ని కనబరుస్తుంది. ఇక ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు ఈ సినిమాతో తమ బ్యానర్ లో మొదటి రీసౌండింగ్ హిట్ ని అందుకున్నారు.