Balakrishna: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా తన చెల్లి షర్మిల, బాలయ్య గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి
ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ.. గతంలో బాలకృష్ణ తన ఇంట్లో కూర్చుని తన చెల్లి గురించి హీరో ప్రభాస్ గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేశారు అంటూ జగన్ మాట్లాడారు అయితే ఈ వ్యాఖ్యలపై గతంలో షర్మిల స్పందించిన ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఇలా ఒకప్పుడు మహిళలను కించపరుస్తూ మాట్లాడింది. వాళ్లే అంటూ ఈయన ప్రస్తుతం సోషల్ మీడియా యాక్టివిస్టులపై జరుగుతున్న అరెస్టుల గురించి మాట్లాడారు.
ఇక ఈ విషయంపై షర్మిల కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా గురించి హీరో ప్రభాస్ గురించి తప్పుడు ప్రచారాలు చేయించింది బాలకృష్ణ గారు కాదు మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో నా గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయించారని మండిపడ్డారు.
ఇలాంటి తరుణంలోనే బాలకృష్ణ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడం కోసం ఈయన శుక్రవారం గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకోవడంతో మీడియా వారు బాలకృష్ణని ప్రశ్నించారు. ఈ విషయం గురించి బాలయ్య స్పందిస్తూ.. షర్మిల గురించి చేస్తున్న ఈ అసత్య ప్రచారం గురించి వాళ్లే పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకుంటానని ఈయన ఎదురు ప్రశ్నించారు. షర్మిల గురించి ఇలాంటి అసత్య ప్రచారాలు ఎవరు చేయిస్తున్నారో అందరికీ స్పష్టంగా తెలుసని తెలిపారు.. వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు కూడా వాళ్ళు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీకి హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ…
👉మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ…
👉వైసీపీ వాళ్లు అసెంబ్లీ కి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారు…
👉ఈరోజు కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుంది…
👉షర్మిల పై అసత్య ప్రచారం… pic.twitter.com/KKiih1YHKD— ChotaNews (@ChotaNewsTelugu) November 22, 2024