AR Rahman: అమీర్ దర్గాను సందర్శించిన ఏఆర్ రెహమాన్.. ఫోటోస్ వైరల్!

AR Rahman: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉన్న అమీర్ దర్గాకు ఉన్న విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. సర్వమతాలకు అతీతంగా ఇక్కడ భక్తులు వచ్చి ఉర్సు మహోత్సవంలో పాల్గొంటారు. ప్రతి ఏడాది నవంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఉర్సు ఉత్సవం ఎక్కడా చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఉర్సు వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆ భక్తులు అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలతో పాటు చాలామంది ప్రముఖులు హాజరవుతారు.

ఈ కార్యక్రమంలో హజరత్ ముస్తాన్ సాహెబ్ కు సంబంధించిన ముజావర్లో గంధం ఉత్సవం జరుగుతుంది. ఎందుకంటే ఈయన దాదాపు 60 ఏళ్ల పైబడి తపస్సు చేసి అతీత శక్తులు పొందారు అనేది ఇక్కడ వారి నమ్మకం. అందుకే కడప అమీన్ పీర్ దర్గాలో మొత్తం 12 ముజావర్లు ఉన్నప్పటికీ అందులో ముస్తాన్ సాహెబ్‌ లో జరిగే ఉర్సు చాలా ప్రధానమైనదిగా చెప్పుకుంటారు. ఈయన తపస్సు చేస్తుండగా గుహలోకి ఒక మేకల కాపరి వెళ్లి పరిశీలించగా ఈయన బయటపడతాడు. ఆ తర్వాత ఆయనను దీనిపై ప్రశ్నించగా సాహెబ్ చెప్పినవన్నీ జరిగాయట. అందుకే ఈయనను ప్రధాన ముజావర్గా చెప్పుకుంటారు. అయితే ఇప్పటివరకు 11 మంది పీఠాధిపతులు అమీన్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తూ వచ్చారు.

ప్రస్తుతం 11వ జాతికి చెందిన ముజావర్లు ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. అయితే కడప అమీన్ పీర్ దర్గాకు ప్రముఖ విద్వాంసుడు ఏ.ఆర్ రెహమాన్ కూడా వస్తుంటారు. ఈ ఏడాది కూడా ఏ ఆర్ రెహమాన్ హాజరయ్యారు. తాజాగా కూడా రెహమాన్ ఈ అమీర్ దర్గాను దర్శించుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం ఈ ఏడాది మాత్రమే కాకుండా ప్రతి ఏడాది ఏ రెహమాన్ కడపలో జరిగే అమీర్ దర్గా ఉత్సవాలలో పాల్గొంటూ ఉంటారు.