ఆచార్య : చిరుపై నిందేసిన వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారా?

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు నడుమ వచ్చి డిజాస్టర్ అయ్యినటువంటి చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసిన చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ చేయగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు.

మరి ప్రీ రిలీజ్ వరకు అంతా బాగానే ఉన్నా సినిమా మాత్రం అసలు చెప్పుకోలేని రీతిలో ఉండేసరికి మీగా ఫ్యాన్స్ కే అసలు సినిమా నచ్చలేదు. అయితే ఇప్పుడు ఈ భారీ సినిమా రిజల్ట్ విషయంలో చాలా మంది మెగాస్టార్ పై నిందలు వేశారు. కానీ ఈ సినిమా విషయంలో అసలు  భాద్యుడు కొరటాల శివనే అని ఇప్పుడు తెలుస్తుంది.

ఈ సినిమాకి భారీ హైప్ రావడానికి సంగీత దర్శకుడు మణిశర్మ కూడా ఒకరు. మరి మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన వర్క్ ని కూడా కొరటాల వద్దు అని వేరేవి చేయించడం సినిమా ఫలితంపై బాగా దెబ్బ తీసింది. మొదట నేను చిరు సినిమాకి తగ్గ స్కోర్ ప్రిపేర్ చేశాను.

ఆయన సినిమాకి ఏ రేంజ్ లో ఇవ్వాలో నాకు తెలుసు అందుకు తగ్గట్టే ఓ వెర్షన్ ప్రిపేర్ చేస్తే దర్శకుడే మీరు ఏదైతే అందుకుంటున్నారో అది వద్దు అని మార్పించారని మణిశర్మ లేటెస్ట్ గా రివీల్ చేశారు. దీనితో ఆచార్య వైఫల్యానికి ప్రధాన కారణం చిరు కాదు కొరటాలే అని అంతా రియలైజ్ అవుతున్నారు.