నాని ‘దసరా’ సంబరం.!

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘దసరా’ మూవీ. శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘దసరా’ మూవీ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడంతో పాటూ, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తోంది. అత్యధిక వసూళ్లు రాబట్టి 100 కోట్ల క్లబ్‌లో నిలిచే సినిమా అనిపించుకుంటోంది. ‘దసరా’తో తన నమ్మకాన్ని నిలబెట్టి, ఇంత సక్సెస్ కట్టబెట్టినందుకు నాని సంతోషంలో ఊగిపోతున్నాడు. అదే సంతోషంలో ‘దసరా’ టీమ్‌కి బహుమతులు ఇస్తున్నాడట.

సినిమా రిలీజ్‌కి ముందే, కీర్తి సురేష్ గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చింది టెక్నీషియన్లకు. ఇప్పుడు సినిమా సక్సెస్ మూడ్‌లో నాని కూడా ‘దసరా’ కోసం పని చేసిన ప్రతీ ఒక్క టెక్నీషియన్‌కి ఖరీదైన బహుమతులను అందిస్తున్నాడట.

అంతేకాదు, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఇంకో సినిమా చేస్తానని ఈ సందర్భంగా మాటిచ్చాడట నాని. ‘దసరా’ నాని నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ సినిమాకి అన్ని వైపుల నుంచీ మంచి రివ్యూస్ రావడంతో పాటూ, పర్‌ఫామెన్స్ పరంగా నానిని నెక్స్‌ట్ లెవల్‌‌లో నిలబెట్టింది.