“యాత్ర 2” నుంచి వై ఎస్ జగన్ అసలైన లుక్ రిలీజ్.!

టాలీవుడ్ సినిమా నుంచి గతంలో వచ్చిన బయోపిక్ చిత్రాల్లో గత 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వచ్చిన చిత్రం “యాత్ర” కూడా ఒకటి. మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలక ఘట్టమైన తన యాత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రం డీసెంట్ హిట్ అయ్యింది.

అయితే ఈ చిత్రంకి సీక్వెల్ ని “యాత్ర 2” ని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో వై ఎస్ ఆర్ తో పాటుగా తన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్ర కూడా కలపడంతో ఈ సినిమాపై వారి అభిమాన శ్రేణుల్లో మరింత ఆసక్తి మొదలైంది.

కాగా ఈ చిత్రం నుంచి ఇప్పుడు జగన్ బర్త్ డే కానుకగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రివీల్ చేశారు. ఈ సినిమాలో జగన్ పాత్రని తమిళ యంగ్ హీరో జీవా చేస్తున్నాడు. మరి ఇది వరకే తన ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో జగన్ ని అంత పర్ఫెక్ట్ గా రిఫ్లెక్ట్ చేయలేదు అని టాక్ ఉంది కానీ.

ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ లో మాత్రం జగన్ లానే తాను కనిపించడంతో ఈ పిక్ వైరల్ గా మారింది. ఈరోజు జగన్ బర్త్ డే కానుకగా జీవా ఈ పోస్టర్ ని రిలీజ్ చేసి జగన్ బర్త్ డే తన పాత్రని చేస్తున్న తాను రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు. అటు సైడ్ కుర్చీలో రాజశేఖర్ రెడ్డి ఇటు సైడ్ కుర్చీలో జగన్ లానే జీవా కనిపిస్తున్నాడు. దీనితో ఈ పోస్టర్ మాత్రం ఇపుడు వారి అభిమానుల్లో స్పెషల్ గా మారింది.