మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారా.. ఆ అలవాటును మాన్పించి చిట్కాలివే!

ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటును కలిగి ఉన్నారు. ఈ అలవాటును మాన్పించని పక్షంలో పెద్దయ్యాక కూడా ఈ అలవాటును కొనసాగించే అవకాశం ఉంటుంది. పిల్లలు పదేపదే నోట్లో వేలు పెట్టుకుంటే పళ్ల వరుస సరిగ్గా రాకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల నోట్లో బ్యాక్టీరియా ప్రవేశించి కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

కాకరరసం, వేపాకు రసం పూయడం ద్వారా పిల్లలకు ఈ అలవాటు మాన్పించాలని చాలామంది భావిస్తారు. ఈ అలవాటును ఓపికగా మాన్పించే ప్రయత్నం చేయాలని అలా చేయకపోతే పిల్లలు ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. పిల్లలు అసలు ఏ సమయంలో నోట్లో వేలు పెట్టి చప్పరిస్తుంటారో గమనిస్తే ఈ సమస్యకు కొంతమేర చెక్ పెట్టవచ్చు.

పిల్లలు వేలు పెట్టుకునే సమయంలో వాళ్లకు చేతులు ఖాళీగా లేకుండా బిజీగా ఉంచే ప్రయత్నం చేస్తే మంచిది. పిల్లలు వేలు పెట్టుకునే సమయంలో చేతులకు పని చెప్పడం ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చని వైద్యులు చెబుతున్నారు. వేలు పెట్టుకోకుండా ఉంటే వాళ్లకు ఇష్టమైనవి ఇస్తామని చెప్పి ఆ అలవాటును మాన్పించే అవకాశాలు ఉంటాయి. పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటే వాళ్లకు చేస్తున్న తప్పును గుర్తు చేస్తే మంచిది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అలవాటు మానకపోతే వైద్యుడిని సంప్రదించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. నోట్లో వేలు పెట్టుకునే వాళ్లు బుద్ధిహీనులుగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. వేలు పదేపదే చప్పరించడం ద్వారా ఆ వేలు సన్నగా మారే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి పిల్లలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది.