నిరుద్యోగులకు ఎల్ఐసీ తీపికబురు.. భారీ వేతనంతో అర్బన్ కెరీర్ ఏజెంట్ల ఉద్యోగ ఖాళీలు?

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది. తాజాగా ఈ సంస్థ అర్బన్ కెరీర్ ఏజెంట్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారికి స్టైఫండ్ ఇవ్వనుందని తెలుస్తోంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

సేల్స్ లో అనుభవం ఉన్నవాళ్లకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయని భోగట్టా. కనీసం ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాదు. ఆగష్టు నెల 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. కాకినాడ, ఇతర అర్బన్ ఏరియాల పరిధిలో ప్రస్తుతం అర్బన్ కెరీర్ ఏజెంట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

0884 – 2378650 నంబర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు బ్రాంచ్ పరిధిలో ఏడాది కాలం పాటు నివాసం ఉండాలి. అర్బన్ పరిధిలో నివశించే వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని గుర్తుంచుకోవాలి. సమీపంలోని బ్రాంచ్ లను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 10,000 రూపాయలకు అటూఇటుగా వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలో ఎల్.ఐ.సీ బ్రాంచ్ ద్వారా లేదా ఎల్.ఐ.సీ ఏజెంట్ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.