పెరుగుతున్న రెడీమేడ్ ఇళ్ల డిమాండ్.. తక్కువ ఖర్చుతో పాటు ఈ ప్రయోజనాలు కూడా..?

ప్రస్థుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ప్రజలు వారి అవసరాలకు తగిన విధంగా అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి తక్కువ ఖర్చుతో అద్భుతమైన కదిలే ఇళ్లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతే కాకుండా ఇంటి కోసం ఎక్కువ స్థలం కూడా అవసరం అవుతుంది. అందువల్ల ఇంటి నిర్మాణం కోసం లక్షలు ఖర్చు చేయకుండా మొబైల్ హోటల్స్ లాగే ఇళ్లు కూడా మొబైల్ హోమ్స్ లాగా మారిపోతున్నాయి. వీటిని ఎక్కడికంటే అక్కడికి షిఫ్ట్ చేసుకునేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ప్రస్తుతం ఇలాంటి ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో రెడీమేడ్ మూవబుల్ ఇళ్లు( Readymade Movable House ) తయారు చేసే కంపెనీలు కూడా పెరిగిపోతున్నాయి. రెడీమేడ్ ఇళ్ల నిర్మాణం చాలా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. ఇవి ఈ కాలమైన ఎండ,వానకు దృఢంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మూవబుల్ రెడీమేడ్ ఇళ్లను చుట్టూ స్టీల్ తో బాడీ చాలా దృఢంగా నిర్మిస్తారు. ఇంతకుముందు చిన్న దుకాణాలు, కార్యాలయాలను స్టీలు బాడీలతో నిర్మించేవారు. ఇప్పుడు ఇదే పద్ధతిని రెడీమేడ్ ఇళ్లు, ఆఫీస్లలో కూడా పాటిస్తున్నారు.

రెడీ మేడ్ ఇళ్లకు డిమాండ్ పెరగటంతో గుంటూరు-విజయవాడ నేషనల్ హైవేకి సమీపంలో మూవబుల్ హౌజ్ లను ( Movable House ) ఒక కంపెనీ తయారు చేస్తోంది. బెడ్ రూమ్, కిచెన్, టాయిలెట్లు, హాల్ వీటన్నిటితో కలిపి 200 అడుగుల నుంచి 360 అడుగుల వరకు విస్తీర్ణం ఉండేలా ఇళ్లను తయారు చేస్తున్నారు. ఇక ఇలాంటి ఇంటిని తయారు చేయటానికి కేవలం లక్షలు మాత్రమే. సాధారణంగా ఇటుకలతో నిర్మించే ఇంటి తో పోల్చితే వీటి ఖర్చు చాలా తక్కువ . ఇక వేసవి కాలంలో కూడా ఈ ళ్ళల్లో ఎక్కువ వేడి ఉండదు. ఎందుకంటే లోపల ర్యాక్ ఊల్ ఫ్లైవుడ్ మెటీరియల్ ఉపయోగించడం వల్ల వేడి తగ్గుతుంది. అలాగే శబ్దాలు కూడా ఇంటి లోపలికి రాకుండా,అగ్ని ప్రమాదాలు జరగకుండా బయట బాగాలన్నీ స్టీల్ తో తయారు చేస్తారు.