సాధారణంగా మనం ఏదైనా పండగల సమయంలోను లేదా పూజ సమయంలోనే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి పూజలు చేయాలి అని చెబుతుంటారు. అసలు ఈ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మ ముహూర్తములు ఏ సమయంలో వస్తుంది ఈ బ్రహ్మ ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనే విషయానికి వస్తే… పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు..
ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. ఇలా మొదట వచ్చే ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ ముహూర్తానికి ఆదిదేవత బ్రహ్మ కనుక ఈ ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు.
ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. పురాతన కాలంలో హిందూ పవిత్ర గ్రంథాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలనాలనిపండితులు చెబుతుంటారు ఇలా బ్రహ్మ ముహూర్తాన లేచి తలంటు స్నానం చేసి పూజా కార్యక్రమాలు చేయటం వల్ల ఆ పూజలకు ఎంతో మంచి ఫలితం ఉంటుందని చెబుతారు ఇక విద్యార్థులు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి చదవడం వల్ల వారి మెదడు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఈ సమయంలో చదివిన చదువు చాలా సులభంగా అర్థమవుతుందని భావిస్తుంటారు అందుకే సూర్యోదయానికి ముందు వచ్చే ఈ ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తుంటారు.