సాధారణంగా మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందాలి అంటే తప్పనిసరిగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ఏ సీజన్లో లభించే పండ్లను ఆయా సీజన్లో తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. ఇకపోతే ప్రతిరోజు ఒక కప్పు దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి దానిమ్మ గింజలను తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..
దానిమ్మ పండులో విటమిన్లు పొటాషియం వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పు దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల 30% విటమిన్ సి 36% విటమిన్ కే మన శరీరానికి అందుతుంది. అలాగే 16% విటమిన్ బి అలాగే పొటాషియం కూడా లభిస్తుంది. ఇక ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా మన శరీరంలో చెడు కొవ్వును తగ్గించడానికి కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు రక్తప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
దానిమ్మ పండు మన శరీరానికి ఒక సహజ ఇన్సులిన్ గా పనిచేయడమే కాకుండా మన శరీరంలో క్యాన్సర్ కారకాలను నిరోధించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అదేవిధంగా జీర్ణక్రియ సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం కావడానికి దానిమ్మ పండ్లు ఎంతగానో దోహదపడతాయి. ఇక ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభించడంతో రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. ఇన్ని పోషక విలువలు కలిగిన దానిమ్మ పండును రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.