తనకి అవార్డ్ రావడంలో ఊహించని నిజం రివీల్ చేసిన హీరో సూర్య.!

భార్య సినిమా కోసం చిక్కుల్లో ప‌డ్డ స్టార్ హీరో‌!

తాజాగా ఇండియన్ సినిమా దగ్గర అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో స్టార్ హీరో సూర్య శివకుమార్ నటించిన సూపర్ హిట్ సినిమా “ఆకాశం నీ హద్దురా” కూడా ఒకటి. అనేక అంశాల్లో ఈ సినిమాకి పలు అవార్డులు వచ్చాయి.

అంతే కాకుండా ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్ గా సూర్యకి కూడా నేషనల్ అవార్డు వస్తుంది అని నమ్మిన వారు మాట నిజం అయ్యి సూర్య కూడా అవార్డు తన అద్భుత నటనకి గాను దక్కించుకున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి అవార్డు రావడంతో సూర్య తన దర్శకురాలు సుధ కొంగరకు ధన్యవాదాలు తెలుపగా..

అసలు ఈ సినిమాపై ఓ ఊహించని నిజాన్ని బయటపెట్టడం ఆసక్తిగా మారింది. సూర్య దగ్గరకి అసలు ఈ సినిమాని తీసుకొచ్చింది మరెవరో కాదు తన భార్య జ్యోతిక అట. తాను ఈ సినిమాని తన దగ్గరకి తీసుకు రాకపోతే ఈ సినిమా చేసి ఉండేవాడిని కాదని తన నిర్మాణంలో తాను నటించడం జరిగింది అంటే..

అది తన భార్య జ్యోతిక వల్లనే అని సూర్య తన ప్రెస్ నోట్ లో తెలిపి ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ “సూరారై పోట్రు” తమిళ్ లో ఈ నేషనల్ అవార్డు దక్కింది. దీనిని మన తెలుగులో “ఆకాశం నీ హద్దురా” గా ఓటిటి లో రిలీజ్ చేశారు.