శంకర్ దగ్గర మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్..లైన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇండియన్ సినిమా దగ్గర తన సినిమాలతో ఎప్పుడో ప్రపంచ సినిమాని ఇండియన్ సినిమా వైపు  తిరిగి చూసేలా చేసిన దర్శకుడు శంకర్. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ స్టార్ దర్శకుడు ఎన్నో సినిమాలలో తన మాయాజాలం చూపించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఇప్పుడు అంటే సరైన హిట్ లేక తన కం బ్యాక్ కోసం అంతా చూస్తున్నారు కానీ ఒక పదేళ్లు అలా వెనక్కి వెళితే శంకర్ తీసిన ఒకో సినిమా ఒకదాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ సెన్సేషన్ గా నిలిచాయి. 

దీనితో ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో రికార్డులు సెట్ చేసాడు శంకర్. ముఖ్యంగా శంకర్ సినిమాలు అంటే భాయీ విజువల్స్ అలాగే స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుంది. అందుకే తనని ఇండియన్ జేమ్స్ క్యామెరూన్ అని కూడా అంటారు. అలా ఎప్పటికప్పుడు హాలీవుడ్ లెవెల్ విజువల్స్ మరియు టేకింగ్ తో ఆశ్చర్య పరిచే శంకర్ ఇపుడు మళ్ళీ తన హిట్ ఫార్మాట్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. 

ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా శంకర్ రాసుకున్న ఓ భారీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పై ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. చరణ్ తో సినిమా స్టార్ట్ అవ్వకముందే 2.0 సినిమా ప్రమోషన్స్ టైం లో తన దగ్గర ఒక సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ ఉందని చాలా ఆసక్తిగా అది ఉంటుంది అని చెప్పారు. మరి ఇప్పుడు ఇదే సినిమా లైన్ అంటూ ఓ టాక్ సినీ వర్గాల్లో లీక్ అయ్యినట్టు తెలుస్తుంది. 

ఈ చిత్రం అంతా అండర్ వాటర్ లో కనిపిస్తుండగా అంతే కాకుండా దీనికి సైన్స్ ఫిక్షన్ జోడించి ఆ సముద్రంలో ఒక ఆక్టోపస్ కూడా కీలక రోల్ గా కనిపిస్తుందట. ఇలా అండర్ వాటర్ అందులో ఆక్టోపస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ లా అనిపిస్తుంది. మరి శంకర్ అయితే ఏం ప్లాన్ చేసాడో కానీ ఇదైతే మైండ్ బ్లోయింగ్ గా ఉందని చెప్పాలి. అలాగే ఇదెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చూడాలి.