సాధారణంగా వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు కారణంగా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య వంటివి కూడా ఒకటి.ఈ విధంగా చాలామంది తలలో చుండ్రు జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడటం కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల షాంపులను ఉపయోగిస్తారు. అలాగే ఎన్నో రకాల సహజ పద్ధతులను ఉపయోగించి చుండ్ర సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా చుండ్రు సమస్య మాత్రం తగ్గదు అయితే జీవితంలో చుండ్రు రాకూడదు అంటే నిమ్మకాయ వెల్లుల్లితో ఇలా చేస్తే చాలు… దీనికోసం ముందుగా ఒక మిక్సీ గిన్నెలో పది తులసి ఆకులు, పది పుదీనా ఆకులు, 5 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు,గుప్పెడు వేపాకు, అరచెక్క నిమ్మరసం పిండి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్లకు అలాగే తల మాడుకు బాగా అంటేలా రాసుకోవాలి. ఇలా జుట్టుకు ఈ మిశ్రమాన్ని మొత్తం రాసిన తర్వాత ఒక గంట వరకు జుట్టును బాగా ఆరనివ్వాలి.
ఈ విధంగా గంటసేపటి తర్వాత కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు ఈ పద్ధతిని పాటించి తలస్నానం చేయటం వల్ల చుండ్రు పేల్లు ఇతర జుట్టు సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అదేవిధంగా ఒత్తయిన నల్లని జుట్టు కూడా మీ సొంతం అవుతుంది. ఇక ఈ పద్ధతిని పాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిట్కాను పాటించి చుండ్రు సమస్యకు చెక్ పెట్టేసేయండి.