పన్నీర్ ను ఆహారంలో ఎక్కువగా తీసుకునే అలవాటు ఉందా? ఈ వ్యాధులు తప్పవు?

పాల ఉత్పత్తుల్లో ఒకటైన పన్నీర్ ను ప్రతిరోజు అనేక రుచికరమైన వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా మట్టర్ పన్నీర్, పన్నీర్ టిక్కా, కడాయి పన్నీర్, పన్నీర్ పకోడా, రసమలై, రసగుల్లా వంటి వంటకాలు భారతదేశ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. పనీర్ రుచితో పాటు మన శరీరానికి అవసరమైన విటమిన్ డి, ఏ ,కాల్షియం ఫాస్పరస్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పన్నీర్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు పనీర్ ఎక్కువగా ఆహారంలో తీసుకుంటే మరిన్ని సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పన్నీర్ లో మాంసాహారంతో సమానంగా ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కావున శాఖాహారుల్లో ప్రోటీన్ లోపాన్ని సరి చేయడానికి పనీర్ అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. పనీర్ లో పుష్కలంగా ఉండే విటమిన్ డి, కాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. ఫైబర్ జీర్ణక్రియ రేట్లు మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అయితే పనీర్లో కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ మరింత పెరిగి గుండె సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.

జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, గ్యాస్ట్రిక్ ,బలబద్ధకం, ఉబ్బసం వంటి జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పనీర్ ను ఆహారంలో తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి భోజనంలో పనీర్ ను ఆహారంలో తీసుకుంటే ఇందులో ఉండే కొవ్వు పదార్థాలు జీర్ణం అవ్వడానికి అధిక సమయం తీసుకుని నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి వస్తుంది. తరచూ అలర్జీ సమస్యతో బాధపడేవారు పన్నీర్ కు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే కొంతమందిలో పనీర్ అధిక ఆలర్జీలకు కారణమవుతుంది.

తరచూ వాంతులు విరేచనాలతో బాధపడేవారు పనీర్ ను ఆహారంలో తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే పనీర్లో అధిక ప్రోటీన్లు ,కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ప్రోటీన్లు ఎక్కువైతే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావాన్ని కలిగించి డయేరియా సమస్యకు దారి తీయవచ్చు. ఉబకాయం, అతి బరువు సమస్యతో బాధపడేవారు అధిక కొవ్వు పదార్థాలు కలిగిన పనీర్ ను ఆహారంలో తక్కువగా తీసుకోవడం మంచిది లేదంటే అతిబరువు సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఇలాంటివారు వైద్యుల సలహా మేరకు పనీర్ ను ఆహారంగా తీసుకోవచ్చు.