గుండె జబ్బు, కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు జున్నును ఆహారంగా తీసుకోవచ్చా..తింటే ఏం జరుగుతుంది?

పాల ఉత్పత్తిలో ఒకటైన జున్నును ఆహారంగా తీసుకోవడంలో అనేక సందేహాలు చాలామందికి ఉన్నాయి. జున్నును ఆహారంగా తీసుకుంటే ఒళ్ళు నొప్పులు, రక్తపోటు, గుండె జబ్బు, అతి బరువు సమస్య ఏర్పడుతుందని చాలామంది జున్నును తినటానికి ఇష్టపడరు. అయితే పాలలో కంటే జున్నులో అత్యధిక ప్రోటీన్స్, విటమిన్స్ ,ఐరన్ , కాల్షియం విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ జున్నును ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జున్నులో అత్యధిక ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఉన్న మాట వాస్తవమే అందుకే అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు, షుగర్ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బు ఉన్నవారు జున్నును తినకపోవడమే మంచిది. తినాలనిపిస్తే అతి తక్కువ పరిమాణంలో విక్షేపము తీసుకోవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడుతూ చాలా సన్నగా,బరువు తక్కువగా ఉన్నవారు జున్నును తమ రోజువారి ఆహారంలో తీసుకున్నట్లయితే వీటిలో పుష్కలంగా ఉన్న ఐరన్, బి12 రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.అలాగే జున్నులో పుష్కలంగా ఉన్న ప్రోటీన్స్ కొవ్వు పదార్థాలు శరీరానికి తగిన శక్తి నిచ్చి ఎముకలను, కండరాలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.

జున్నులో అత్యధికంగా కాల్షియం లభ్యమవుతుంది ఇది మన శరీరంలోని ఎముకలను , దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడి వృద్ధాప్యంలో వచ్చి ఆస్తరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధులను అదుపు చేయడంలో సహాయపడుతుంది. జున్నును తరచూ మన ఆహారంలో భాగం చేసుకుంటే ఇందులో పుష్కలంగా ఉన్న కొవ్వు ఆమ్లాలు మెదడు కణాలను ఉత్తేజపరిచి మెదడు చురుగ్గా ఉంచడంతోపాటు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు జున్నును ఆహారంగా తీసుకుంటే తల్లి బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. జున్నులు విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.జున్నును తగిన పరిమాణంలో తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.