ఇప్పుడు గుండెపోటు అనేది వృద్ధులకే కాదు.. మారుతున్న ఆహారం, వ్యాయామం కొరత, పని ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనూ గుండె సమస్యలు వస్తున్నాయి. చాలా మంది వ్యాధి వచ్చేలోపు గుర్తించలేక చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ గుండెపోటు రాకముందే మన శరీరం కొన్ని హెచ్చరికలు ఇస్తుందటని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఒకటి రెండు రోజులు ముందు కాదు.. కొన్ని వారాల ముందే చిన్నచిన్న మార్పులు మొదలవుతాయంట. ఉదాహరణకు ఛాతీ చుట్టూ గుబురుగా అనిపించడం, వాపు వచ్చినట్లు భావం కలగడం, చేతులు, భుజాలు, దవడకు నొప్పి రావడం మొదలవుతుంది. కొందరికి చిన్న పనికీ ఊపిరి తేలికపోవడం మొదలవుతుంది. సాధారణంగా అలాంటి లక్షణాలను చాలామంది తేలికగా తీసుకుంటారు.. కానీ ఇవే పెద్ద సమస్యలకు దారి తీస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఎలాంటి కష్టమైన పని చేయకుండా చమటలు పట్టడం.. ఎనర్జీ లేకుండా అలసటగా అనిపించడం కూడా గుండెపోటుకు ముందు వచ్చే సూచనల్లో ఒకటి. ఇంకా కొందరికి తల తిరగడం, ఒక్కోసారి మూర్చపోవడం జరుగుతుందట. ఎక్కువగా ఈ సమస్యలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి టెస్ట్‌లు చేయించుకోవాలని చెబుతున్నారు.
ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు మొదలవ్వడం కూడా గుండె బలహీనతకు సంకేతమని చెబుతున్నారు.
చిన్న పని చేసినా శ్వాస ఆడకపోవడం సాధారణం కాదు. అలాంటప్పుడు ఇంట్లో ఉండిపోకుండా.. వైద్యులను కలవాలని సూచిస్తున్నారు. ఈ చిన్నచిన్న హెచ్చరికలను గుర్తిస్తే గుండెపోటు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణాలు కాపాడుకోవచ్చు. (గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అనుమానమైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.)