ఆయనో యంగ్ హీరో. ఒకే ఒక్క సినిమాతో సెన్సేషనల్ అయిన హీరో. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించి టాలీవుడ్లో పేరు తెచ్చుకున్నాడు. మంచి విషయమున్న హీరోనే.
అయితే, తొలి సినిమా ఇచ్చిన క్రేజ్ ఆ తర్వాత ఏ సినిమాతోనూ దక్కించుకోలేక పోయాడీ యంగ్ హీరో. విలన్‌గానూ ట్రై చేశాడు. స్టార్ హీరోతోనే తలపడ్డాడు. అయిన ఫలితం దక్కలేదు.
భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేశాడు. అయినా ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాడు. రీసెంట్గా ఓ సినిమా చేస్తున్నాడనుకోండి. అయితే, ఎందుకో మనోడు కథలు వినడానికే భయపడుతున్నాడని అంటున్నారు.
చేతిలో మంచి ప్రొడ్యూసర్లతో పాటూ, మంచి బ్యానర్లు కూడా వున్నాయ్. మంచి రెమ్యునరేషన్ కూడా పలుకుతోంది. సత్తా వున్న దర్శకులు సైతం ఆ యంగ్ హీరోతో పని చేసేందుకు కుతూహలంగా వున్నారట. అయినా ఎందుకో భయపడుతున్నాడట. ఈ భయానికి కారణం ఒక్కటే, ఇకపై ఫ్లాప్స్ వస్తే ఇక తన పని అంతే.! అనుకుంటున్నాడట.
అయితే, ఆ భయం వీడి చేయాల్సిన ప్రయత్నాలు చేయాలని ఆ యంగ్ హీరోకి సన్నిహితులు సూచిస్తున్నారట. ఇంతకీ అంతలా భయపడుతున్న ఆ యంగ్ హీరో ఎవరు.? ఏంటా కథ.? తెలియాల్సి వుంది.