Bollywood Beauties To Tollywood : ఆ డైరెక్టర్ చిటికేస్తే చాలు బాలీవుడ్ భామలు టాలీవుడ్‌లో వాలిపోతారు.!

Bollywood Beauties To Tollywood

Bollywood Beauties To Tollywood : ఆ డైరెక్టర్ చాలా హాట్ గురూ.! అనే మాట ఆయన విషయంలో పక్కాగా సెట్ అవుతుందేమో. ఇంతకీ ఎవరా డైరెక్టర్.? ఏంటా కథ.? అంటే జయంత్.సి.పరాన్జీ. ఒకప్పుడు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారీయన.

చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్‌బాబు, .. ఇలా స్టార్ హీరోలతో సూపర్ సక్సెస్‌లు అందుకున్న ఘనత ఈయన ఖాతాలో వుంది.

కాగా, ఈయన పిలిస్తే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రెక్కలు కట్టుకుని వాలిపోతారట. ఏం మ్యాజిక్ చేస్తాడో ఏమో కానీ, జయంత్ మాటంటే ఆ ముద్దుగుమ్మలకు అంత గురి. అందుకే ఈయన్ని అందరూ టాలీవుడ్ రొమాంటిక్ డైరెక్టర్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

వెంకటేష్ నటించిన ‘ప్రేమించుకుందాం రా’ సినిమా కోసం అంజలా జవేరిని టాలీవుడ్‌కి పరిచయం చేసింది జయంత్ సి.పరాన్జీ. ఆ తర్వాత చిరంజీవితో ‘చూడాలని వుంది’ సినిమాలో నటించిందీ అందాల బొమ్మ.

అలాగే, ‘ప్రేమంటే ఇదేరా’ సినిమా కోసం ప్రీతి జింటానీ, కింగ్ నాగ్‌తో ‘రావోయి చందమామ’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్‌ని సైతం తెలుగులోకి తీసుకొచ్చేశాడీ రొమాంటిక్ డైరెక్టర్.

మహేష్ బాబు ‘టక్కరి దొంగ’ సినిమా కోసమైతే ఏకంగా ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మల్నిటాలీవుడ్‌కి లాక్కొచ్చేశాడు. వాళ్లెవరో కాదు, లిసారే, బిపాసా బసు. ఈ ఇద్దరు భామలు టాలీవుడ్‌లో ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదనుకోండి. (Bollywood Beauties To Tollywood)

అలాగే యంగ్ హీరో తరుణ్ కోసం నౌహిద్ సైరుసిని కూడా టాలీవుడ్‌కి పరిచయం చేసిన ఘనత జయంత్ సి. పరాన్జీది. తరుణ్‌తో ‘సఖియా’ సినిమాలో నటించిందీ ముద్దుగుమ్మ. ఇలా చెప్పుకుంటూ పోతే, టాలీవుడ్‌కి ఈయన పరిచయం చేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మల లిస్టు చాలా పెద్దదే మరి.