విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన తన మొదటి ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం “శబరి” ఈ వారం థియేటర్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిఇచ్చిందో తెలుసుకుందాం…
కథ : అనగనగా సంజన (వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్ (గణేష్ వెంకటరామన్) లు తమ కాలేజీ సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారికి రియా(బేబీ వివేక్ష) అనే కూతురు కూడా ఉంటుంది. కానీ ఓరోజు తన భర్త చేసిన చీప్ పని వల్ల ఆమె అతని నుంచి దూరంగా తన కూతురితో కలిసి వైజాగ్ కు వచ్చేస్తుంది. అయితే సంజనకు తన తల్లితో మంచి అనుబంధం ఉంటుంది కానీ.. ఆమె తన చిన్ననాటి నుంచే చనిపోవడం, ఇంకోపక్క తనకి తన కూతురుతో ఉన్న బంధం, వీరి కథలోకి సూర్య(మైమ్ గోపి) ఎందుకు ఎంటర్ అవుతాడు. రియా కోసం ఎందుకు వెతుకుతూ ఉంటాడు? వీరందరికీ ఉన్న కనెక్షన్ ఏంటి? రియాని సంజన కాపాడుకుంటుందా? లేదా అనేది తెలియాలి అంటే సినిమాని తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ : ఈ చిత్రంలో ప్రేక్షకుడిని డిజప్పాయింట్ చేసే అంశాలు చాలా కనిపిస్తాయి. దర్శకుడు అనీల్ కాట్జ్ తాను కొంతమేర థ్రిల్ చేసే సబ్జెక్టు పట్టుకున్నారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో మెప్పించే విధంగా ఆవిష్కరించలేకపోయారు. చాలా బోరింగ్ అండ్ విసుగు తెప్పించే నరేషన్ తో కథనాన్ని తాను నడిపించారు. ఒక్క ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ తప్ప అసలు సినిమాలో చెప్పుకోడానికి సరైన సన్నివేశం కానీ ఎమోషన్స్ కానీ కనిపించవు. అసలు సినిమా మొదలైన నాటి నుంచే నెమ్మదిగా సాగే బోరింగ్ కథనంతో సాగదీతగా అనిపిస్తుంది. అంతే కాకుండా ప్రీ ఇంటర్వెల్ వరకు ఏమాత్రం ఆసక్తి కలగదు. ఇంకా కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అందులోని ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వవు. వీటితో సెకండాఫ్ మరింత నిరుత్సాహ పరుస్తుంది. వీటితో పాటుగా సినిమాలో ఫస్టాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ మొత్తం డీసెంట్ గా అనిపిస్తుంది. ఆ సమయంలో బిల్డ్ అయ్యే ట్విస్ట్ కానీ సస్పెన్స్ ఫ్యాక్టర్ కానీ చూసేందుకు మెప్పిస్తాయి. అలాగే ఈ కొన్ని సీన్స్ లో గోపి సుందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టీవ్ గా ఉంది. ఊహాజనితంగా సాగే కథనం, ఇట్టే అర్ధం అయ్యిపోయే డైలాగులు సినిమాని మరింత పేలవంగా మార్చివేస్తాయి. వీటితో పాటుగా చాలా సీన్స్ లో లాజిక్స్ మిస్ అయ్యాయి. అసలు సినిమాలో చాలా సీన్స్ ప్రాంతాన్ని విశాఖగా చూపించి అందులో హైదరాబాద్ మాల్స్ ఏరియాలు చూపించడం అనేది పెద్ద బ్లండర్ గా చెప్పాలి. విచిత్రంగా ఓ సీన్ అయితే వరలక్ష్మి శరత్ కుమార్ పై వర్షం పడుతున్నా కూడా తడవకుండా కనిపించడం గమనార్హం. ఇక వీటితో పాటుగా మరికొన్ని సీన్స్ ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి ఇంకా కొన్ని రిపీటెడ్ గా అనిపిస్తాయి. దీనితో సినిమాపై ఆసక్తి మరింత సన్నగిల్లుతుంది. అయితే.. సినిమాలో మెయిన్ లీడ్ నటీనటుల నటనలు బాగున్నాయి. ఒక తల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి ఆమెలోని వెర్సటాలిటీ చూపించారు. పలు ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ తరహా సీన్స్ లో కానీ నీట్ పెర్ఫామెన్స్ ని కనబరిచారు. ఇక ఆమెతో పాటుగా తన కూతురుగా నటించిన బేబీ వివేక్ష కూడా బాగా నటించింది. వీరితో పాటుగా మైమ్ గోపి, శశాంక్, గణేష్ వెంకటరామన్ తదితరులు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మొత్తంగా చూసినట్టు అయితే ఈ “శబరి”లో నటీనటుల పెర్ఫామెన్స్ లు వరకు ఓకే అలాగే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వరకు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఈ ఫ్యాక్టర్ ని దర్శకుడు సెకండాఫ్ లో మైంటైన్ చేయడంలో విఫలం అయ్యారు. పైగా వర్కౌట్ అవ్వని ఎమోషన్స్, సాగదీతగా ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే లు బాగా నిరుత్సాహ పరుస్తాయి
సాంకేతిక వర్గం : సినిమాలో గోపి సుందర్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఓకే కానీ సెకండాఫ్ లో అయితే కొట్టిందే కొట్టి బోర్ తెప్పిస్తాడు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. డైలాగ్స్ చాలా యావరేజ్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి. కానీ టెక్నీకల్ టీం పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
(చిత్రం : శబరి, విడుదల : 3, మే-2024, రేటింగ్ : 2/5, నటీనటులు: వరలక్ష్మి శరత్ కుమార్, గణేష్ వెంకటరామన్, శశాంక్, మైమ్ గోపి, బేబీ వివేక్ష తదితరులు. దర్శకత్వం : అనిల్ కాట్జ్, నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల, సంగీతం : గోపి సుందర్, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల)