గోపీ.. ప్రభాస్ ‘నో’ చెప్పాడట కదా.!

ప్రభాస్ – గోపీచంద్.. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. మొన్నామధ్య ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోలో కూడా ఇద్దరూ సందడి చేశారు. గోపీచంద్ కొత్త సినిమా ‘రామబాణం’ ప్రమోషన్స్ కోసం ప్రభాస్‌ని వాడేస్తారంటూ కొన్నాళ్ళ క్రితం గుసగుసలు వినిపించాయి.

కానీ, గోపీచంద్ ఆ దిశగా ఛాన్స్ తీసుకోలేదట. ప్రభాస్‌ని మొహమాట పెట్టడం ఇష్టంలేక.. అంటూ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ చెప్పుకొచ్చాడు. అయితే, తెరవెనుకాల కథ వేరేగా వుందని అంటున్నారు.

గోపీచంద్ అడిగినా, ప్రభాస్ ‘నో’ చెప్పాడన్నది ఓ గుసగుస. ‘ఆ ఛాన్సే లేదు..’ అని గోపీచంద్ సన్నిహితులు అంటున్నారు. కానీ, నిప్పు లేకుండా పొగ అయితే రాదు కదా.!

‘రామబాణం’ సక్సెస్ గోపీచంద్‌కి చాలా చాలా అవసరం ఇప్పుడు. ఆ సినిమాకి ప్రభాస్ చల్లని చూపులు.. అంటే, ప్రభాస్ అభిమానుల మద్దతు వుంటే, ఓపెనింగ్స్ బాగా వస్తాయ్.. మరి, ప్రభాస్ ఎందుకు ‘నో’ చెప్పాడో.?