HomeTR Exclusiveచంద్రబాబు ఇలా చంపేస్తున్నాడు బాబోయ్

చంద్రబాబు ఇలా చంపేస్తున్నాడు బాబోయ్

(PK)

జిల్లా కలెక్టర్ల సదస్సులకు ఒకప్పుడు చాలా ప్రాధాన్యం ఉండేది. కలెక్టర్లంటే మన పరిపాలనా వ్యవస్థకు మూల స్తంభాలు. ∙అలాంటి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులు రాష్ట్రంలో పరిపాలన ఎలాఉంది, పథకాలు అమలుచేయడం ఎలా ఉంది, ఎలా ఉండాలి అనే విషయాలు చర్చించేందుకు కలెక్టర్ల సద్సలు నిర్వహించేవారు. ఇప్పుడు ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ టీడీపీ మీటింగుల స్థాయికి పడిపోయింది. అర్థం పర్థం లేకుండా, సరైన ఎజెండా పెట్టుకోకుండా, ఎజెండా ఉన్నా దాంతో సంబంధం లేనట్లు నిర్వహిస్తున్న ఈ సమావేశాలపై ఐఏఎస్‌ అధికారులు చాటుగా జోక్స్ వేసుకుంటున్నారు. కలెక్టర్ల కాన్షరెన్ష అన్నా, ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అన్నా భయపడుతున్నారు.

Chandrababu Meeting | Telugu Rajyam
కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా ఇలాగే అయిపోయింది

ఈ సమావేశాలు ఎందుకు పెడుతున్నారో కూడా తమకు అర్థం కావడంలేదని ఒకరికొకరు చెప్పుకుంటూ వాపోతున్నారు.
ఉండవల్లిలోని తన ఇంటి వద్ద శుక్రవారం కలెక్టర్ల సమావేశం పెట్టిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాన్ని ఈ సమావేశంలో కొనసాగించి అధికారుల సహనానికి పరీక్ష పెట్టారు. కేసీఆర్‌ తనపై చేసిన విమర్శలు, వాటికి తాను సమాధానం చెప్పిన తీరు, కేంద్రం, రాష్ట్ర రాజకీయాల గురించి సుదీర్ఘంగా తన ప్రారంభోత్సవ ఉపన్యాసంలో వివరించడంతో అధికారులు ఒకరిమొఖాలు ఒకరు చూసుకున్నారు. తానిప్పుడు జాతీయ రాజకీయాల్లో అనివార్యంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తాను లేకపోతే దేశం భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నానని తన గొప్పతనాన్ని చాటుకున్నారు.
జరుగుతున్న సమావేశం ఏమిటి? అందులో ఉన్న వారు ఎవరు? తాను మాట్లాడే మాటలు ఏమిటనే కనీస స్పృహ కూడా లేకుండా చంద్రబాబు ఈ సమావేశంలో రాజకీయ ప్రసంగం ఇచ్చేశారు. అందుకే నాలుగున్నరేళ్లుగా కలెక్టర్ల కాన్ఫరెన్సులు ఊకదంపుడు ఉపన్యాసలకే పరిమితమై అప్రాధాన్యంగా మారిపోయాయి.

ఏ ప్రభుత్వమైనా ఆరు నెలలకోసారి, ప్రధాన అంశాలుంటే మూడు నెలలకోసారి కలెక్టర్ల సమావేశాలు నిర్వహిస్తుంది. పాలనపరమైన అంశాలు, విధాన పరమైన నిర్ణయాలు అందులో తీసుకోవడం, తాను కోరుకున్న విధంగా పాలన జరగడానికి అవసరమైన దిశానిర్దేశాన్ని అధికారులకు సీఎం ఇవ్వడం ఏ రాష్ట్రంలో అయినా కలెక్టర్ల సమావేశాల్లో జరుగుతుంటుంది. ఇందుకువిరుద్ధంగా ప్రతి నెలా కలెక్టర్ల సమావేశాలు పెట్టి రాజకీయ ప్రసంగాలివ్వడం చంద్రబాబు అలవాటుగా మారింది. గత నెల 25వ తేదీన సమావేశం నిర్వహించగా నెలరోజుల్లోనే మళ్లీ శుక్రవారం సమావేశం పెట్టారు. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుతో నిమిత్తం లేకుండా అదేపనిగా మాట్లాడడం, దాన్ని పత్రికలు, టీవీల్లో ప్రచారం చేయించుకోవడమే ఈ సమావేశాల ఎజెండాగా ఉంటోంది.

Collectors Conference | Telugu Rajyam
శుక్రవారం నాటి కలెక్టర్స్ కాన్షరెన్స్

ఇదిగో ఇలా సాగింది, ఆయన ఉపన్యాసం

“భారతదేశంలో ‘పొలిటికల్ గవర్నెన్స్’ ఉందని, ప్రత్యర్ధులు చేస్తున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. 2014లో నరేంద్ర మోదీని నమ్మి దేశం సంపూర్ణ మెజారిటీ అందించిందని, అయితే మోదీ చెప్పినదానికి, చేసినదానికి పొంతనలేకుండా పోయిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా కేంద్రంలో నరేంద్రమోదీ పాలన సాగిందన్నారు. నరేంద్ర మోదీపై ప్రజలు ఆరోజు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో, ఈరోజు అంతగా నిరాశలో కూరుకుపోయారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం 16 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం, జాతీయ ప్రాజెక్టుగా కాంగ్రెస్ హయాంలోనే గుర్తించింది.”
అంతేనా….కాదు, ఇంకా ఇలా చెప్పారు.
“ఐదు వేల ఎకరాల భూమిని సేకరించి శంషాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే రక్షణశాఖ సలహాదారు అడ్డుచెప్పారని, ఆనాడు ప్రధాన మంత్రి స్థాయిలో జోక్యం చేసుకుని అడ్డంకులు తొలగించాం. బిల్‌గేట్స్‌ను కలిసి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరాను. అహ్మదాబాద్, బెంగుళూరు నగరాలకు మెట్రో రైలు ఇవ్వాలని ఆనాటి ప్రధాని వాజపేయి నిర్ణయిస్తే హైదరాబాద్‌కు కూడా మెట్రో రైలు ఇవ్వాలని ఒప్పించాను. అవుటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కు అతిపెద్ద ఆస్తి. అవుటర్ రింగ్ రోడ్డుకు తాను ఆరోజు రూపకల్పన చేయడం నేడు హైదరాబాద్‌కు పెద్ద ఆస్తిగా మారింది. 165 కి.మీ. పొడవున 8 వరుసల రహదారిని 20 ఏళ్ల క్రితం వేయాలనుకోవడం తన విజన్ ఫలితమే.
అప్పట్లో హైదరాబాద్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీస్ నడపడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు అమరావతికి అవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అప్పట్లో హైదరాబాద్ అభివృద్ధికి తాను కేంద్రంపై తీసుకువచ్చిన ఒత్తిడి చూసి, దేశ రాజధాని కూడా హైదరాబాద్‌కు తీసుకువెళ్లేట్టు ఉన్నారని వాజపేయి వ్యాఖ్యానించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోసం రంగాచారి దేశమంతా తిరిగారు. ఎక్కడా భూమి లభ్యం కాలేదు. నేను భూమి ఇస్తానని చెప్పి వాజపేయిని కలిసిశాను. హైదరాబాద్‌ను నేను నిర్మించానని కేసీఆర్ ఎద్దేవా చేస్తున్నందుకే ఇవన్నీ గుర్తుచేయాల్సి వస్తోంది. గచ్చిబౌలి స్టేడియం తానే నిర్మించానని, పట్టుబట్టి జాతీయ క్రీడలు నిర్వహించాం.”

చంద్రబాబు ప్రతిరోజూ ఉదయమే జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు. అందులో ఎప్పుడూ ఆయన ఇచ్చే ఉపన్యాసమే తప్ప కొత్త ఏమీ ఉండదు. వారంలో ఒకసారి వీడియోకాన్ఫరెన్స్‌ పెడతారు. శాఖల వారీగా సమీక్షల పేరుతో ప్రసంగాలిస్తారు. ప్రతిరోజూ ఏదో ఒక పేరుతో ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఉండే ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశాలను తరచూ ఎందుకు పెడుతున్నారో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ కూర్చోవడం ఐఏఎస్‌ అధికారులకు అలవాటైపోయింది.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News