ఇది మరీ టూమచ్ అని ఎవరైనా అనుకున్నాసరే.! సినీ పరిశ్రమలో అంతే. రాత్రికి రాత్రి లెక్కలు మారిపోతాయ్. ‘ధమాకా’ సినిమాతో శ్రీలీల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ‘శ్రీలీల ఎనర్జీ, డాన్సుల్ని మినహాయిస్తే, ఆ సినిమాలో ఏముంది.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో జరుగుతోంది.
‘అబ్బే, రవితేజగారి ఎనర్జీతో పోల్చితే నేనెంత.?’ అంటూ శ్రీలీల అప్పట్లో క్లారిటీ ఇచ్చినా, ఆమెను మాత్రం మోసేస్తూనే వున్నారు. తాజాగా ఓ ప్రముఖ నిర్మాత, శ్రీలీల వద్దకు కోటిన్నర ఆఫర్‌తో వెళ్ళాడని అంటున్నారు. ఓ యంగ్ హీరోతో సినిమా కోసం ఆ నిర్మాత, శ్రీలీలని సంప్రదించాడట. అంత పెద్ద ఆఫర్ వస్తే, ఆమె కాదనుకుంటుందా.? ఛాన్సే లేదు.
ప్రస్తుతం దాదాపు నాలుగైదు సినిమాలు శ్రీలీల చేతిలో వున్నాయ్. ఇదీ శ్రీలీల ధమాకా అంటే. అన్నట్టు, కోటిన్నర ఆఫర్ వచ్చిన సినిమాలోని యంగ్ హీరో ఈ మధ్య సక్సెస్ కోసం కొంత టెన్షన్‌లో వున్నాడట.