విమర్శలకూ, వివాదాలకూ దూరంగా మెగాస్టార్ చిరంజీవి.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విదేశాల్లో వున్నారు. ఆయన యాక్టివ్‌గా వున్నా లేకపోయినా సినీ రాజకీయ రంగాల్లో ఆయన పేరు ప్రస్థావనకొస్తూనే వుంటుంది. కానీ, చిరంజీవి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. ఎన్టీయార్ శత జయంతి వేడుకకి చిరంజీవి హాజరు కావల్సి వున్నా హాజరు కాలేకపోయారు విదేశాల్లో వున్న కారణంగా.

ఆయన్ని ఆహ్వానించే విషయంలోనూ కొంత నిర్లక్ష్యం కనిపించిందనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఆ విషయం బయటపడకుండా వుండేందుకు తన వంతుగా ప్రయత్నించారాయన.

చరణ్‌ని పంపించడం ద్వారా ఆ లోటు కనిపించకుండా చేశారు. అయినా కానీ, ఓ వర్గం మాత్రం చిరంజీవిని ట్రోల్ చేస్తూనే వుంది. ఎవరేమనుకున్నా.. తాను చేయాలనుకున్నది తాను సైలెంట్‌గా చేసుకుంటూ పోతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి విమర్శలకూ, వివాదాలకూ తావివ్వకూడన్న వుద్దేశ్యంతోనే ఏం జరిగినా చిరంజీవి కామ్‌గా వుండిపోతున్నారనీ ఆయనకు అత్యంత సన్నిహితుల ద్వారా వినికిడి.