ఆ విషయంలో బాబును బుట్టలో వేసుకున్న జగన్!

మన గొప్పతనం ఎప్పుడూ మనం చెప్పుకోకూడదు.. మన ఫెర్మార్మెన్స్ చూశాక ఇతరులు చెప్పాలి అని అంటుంటారు పెద్దలు. పైగా… మనం చేసే పని పైకి చెప్పాల్సిన పనిలేదు.. పని అయ్యాక ఆ ప్రతిఫలమే చాటింపేస్తాది అని అంటుంటారు. అయితే… తాజాగా ఈ విషయాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును బుట్టలో వేసుకునే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సరిగ్గా సూటవుతాయని అంటున్నారు విశ్లేషకులు.

మహానాడు వేదికగా తొలివిడత మేనిఫెస్టోను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఈ మేనిఫెస్టో ఎలా ఉంది.. జనాలు ఏమనుకుంటున్నారు.. ఆఖరికి టీడీపీ కార్యకర్తలకైనా ఇది నచ్చిందా.. కనీసం వారినైనా ప్రభావింతంచేసేలా ఉందా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే… ఇది పూర్తిగా చంద్రబాబు వైఖరికి, ఆలోచనావిధానానికీ విరుద్ధమైనదని అంటున్నారు పరిశీలకులు.

అవును… చంద్రబాబుకు సంక్షేమం కంటే అభివృద్ధిపైనే నమ్మకం ఎక్కువ! ఏపీలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ వ్యవసాయం దండగ అనే స్థాయి కామెంట్లు చేయగలిగారంటే… టెక్నాలజీ పై ఆయనకు అంత మక్కువ! చంద్రబాబు గురించి ఆయనను అభినందించేవారు ఎవరూ ఏ సంక్షేమం పేరు చెప్పి అభినందించరు.. కేవలం అభివృద్ధి, విజన్ కలిగిన నేతగానే ఆయన్ని చూస్తారు! అయితే… ఈ విషయంలో చంద్రబాబు గాడి తప్పారు.. జగన్ వేసిన బుట్టలో పడిపోయారు!

స్వర్గీయ ఎన్టీఆర్ పేరు చెప్పినా, స్వర్గీయ వైఎస్సార్ పేరు చెప్పినా, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు చెప్పినా బలంగా వినిపించేమాట… సంక్షేమం. ఈ విషయంలో ఎవరి వారు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. కానీ చంద్రబాబు అలా కాదు.. ఆయనకు అభివృద్ధి పై మక్కువ ఎక్కువ. ప్రతిఫలం పైకి కనిపించినా కనిపించకపోయినా… ఆయన ఆ ట్రెండ్ లోనే వెళ్టుంటారు. పైగా ఆయనను ఆ విధంగానే కార్యకర్తలు గౌరవిస్తారు.. ప్రజలు ఆదరిస్తుంటారు.

అయితే చంద్రబాబు ఆ ఐడెంటిటీని చెరిపేసుకునే పనికి పూనుకున్నారు. జగన్ మాదిరిగానే సంక్షేమం టాపిక్ ఎత్తుకున్నారు. జగన్ ఇస్తున్న పథకాలను కంటిన్యూ చేస్తూనే… మరికొన్ని సంక్షేమ పథకాలు ఇస్తామంటూ జగన్ బాటలోకి వచ్చేశారు. దీంతో… ఆల్ రెడీ జగన్ ఇస్తున్నారుగా.. అవే పథకాలు ఇచ్చే ఫలమైతే ఇంక మీరెందుకు? అనే మాటలు తెరపైకి వచ్చాయి. దీంతో… ప్రస్తుతం ఉన్న పథకాలకు పేర్లు మార్చి, చిన్న చిన్న కరెక్షన్ చేసి కొత్త రంగేసుకుని వచ్చారు బాబు. దీంతో బాబు పరువు మొత్తం పోయిందనే కామెంట్లు మొదలైపోయాయి! దీనికి తోడు పక్కరాష్ట్రాల్లోని ఆయా పార్టీలు ఇచ్చిన పథకాలను ఏరి తెచ్చిపెట్టుకున్నారు.

ఫలితంగా అసెంబుల్డ్ మేనిఫెస్టో తీసుకొచ్చారంటూ ఫైరవుతున్నారు ఏపీ జనాలు. ఇక తన అభివృద్ధి మంత్రాన్ని పక్కనపెట్టి… సంక్షేమం వైపు బాబుని మళ్లించడంలో జగన్ సక్సెస్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా… చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకునేలా జగన్ పథకాలు రచించారని చెబుతున్నారు. మరి రెండో విడతలో ప్రకటించే మ్యానిఫెస్టో విషయంలో అయినా చంద్రబాబు తన మార్కు చూపిస్తారా.. లేక, జగన్ నే ఫాలో అవుతూ – మరో అసెంబుల్డ్ మ్యానిఫెస్టోను తెస్తారా అన్నది వేచి చూడాలి!