అనుపమ పరమేశ్వరన్.. తెరపై చూస్తే, పక్కింటమ్మాయిలా కనిపించేది. కానీ, ఇప్పుడేమో ట్రెండ్ మార్చేసింది. సినిమాల్లో హాట్ అప్పీల్ ఇరగదీసేస్తోంది. ‘టిల్లు స్క్వేర్’ సినిమా కోసమైతే హద్దులన్నీ దాటేసినట్లుంది గ్లామర్ పరంగా.
సినిమా అన్నాక గ్లామర్ తప్పనిసరైపోయింది. ట్రెండ్ మారింది కదా.. లిప్ లాక్స్ అనేవి చాలా చాలా చిన్న విషయాలే అయిపోయాయ్. ఈ విషయంలో అనుపమని మాత్రమే తప్పు పడితే ఎలా.?
ఆ సంగతి పక్కన పెడితే, అనుపమ పరమేశ్వరన్ మరో హాట్ మూవీలో నటించబోతోందిట. ఈసారి కూడా ఓ యంగ్ హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదరగొట్టేయబోతోందిట. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ వున్న ఆ యంగ్ హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఆ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఆన్ స్క్రీన్ రొమాన్స్ అనేది ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనీ, నటనలో అదీ ఓ భాగమేనని హీరోయిన్లు చెప్పడం కొత్తేమీ కాదు. అనుపమ పరమేశ్వరన్ కూడా తన హాట్ అప్పీల్‌ని అలాగే కవర్ చేసుకుంటోంది.
నిజమే, ట్రెండ్ మారింది.! హాట్ అప్పీల్ విషయంలో కేవలం అనుపమనే తప్పు పడితే ఎలా.?