Mohan Babu: టాలీవుడ్ కలెక్షన్ కింగ్ కింగ్, స్టార్ హీరో మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాల్లో నటించే మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే మోహన్ బాబు నట ప్రయాణంలో 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా తల్లిదండ్రుల ఆశీస్సులు, నటనలో నాకు జన్మనిచ్చిన దాసరి నారాయణరావు గారి దీవెనలు నాపై ఎల్లప్పుడూ ఉంటాయి. సీనియర్ ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఎప్పుడూ నన్ను వారి సొంత తమ్ముడిలా భావించారు. అన్నిటికంటే ముఖ్యంగా అభిమానుల ప్రేమాభిమానాల వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను. 1975 మార్చి వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. భోజనం కూడా దొరకక ఎన్నో రోజులు ఇబ్బందులు పడ్డాను. నేడు మీ అందరితో కలిసి భోజనం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని విష్ణుని అడిగాను.
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎలా పనిచేస్తున్నారో ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. విష్ణు చెప్పిన మాటను కచ్చితంగా నెరవేరుస్తారు. దేశమే గర్వించదగ్గ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన సినీ ప్రస్థానం మొదలయ్య 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.