Soniya Akula: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చిన బిగ్ బాస్ సోనియా.. ఇదేం ట్విస్ట్ అంటూ!

Soniya Akula: ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్లలో సోనియా ఆకుల కూడా ఒకరు. ఈమె బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఎంట్రీ ఎంత పాపులారిటీని సంపాదించుకుందో అంతే నెగటివిటీని కూడా సంపాదించుకుందని చెప్పాలి. అయితే బిగ్ బాస్ హౌస్ కీ ఎంట్రీ ఇవ్వకముందు వరకు ఆర్జీవి దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో నటించినప్పటికీ రాని గుర్తింపు ఈ సినిమాతో దక్కింది. ఇక హౌస్ లోనూ తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది.

అయితే నిఖిల్, పృథ్వీల విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు చాలామందిని హర్ట్ చేసింది. ఇదే క్రమంలో ఆమె ఆట తీరు కూడా మారిపోయింది. ఫలితంగా చివరి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందనుకున్న సోనియా ఆకుల నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది. నామినేషన్స్ లో తక్కువ ఓట్లు పడడంతో ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా సోనియా పేరు బాగా వినిపిస్తోంది. పలు ఇంటర్వ్యూల్లో భాగంగా బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిందీ ముద్దుగుమ్మ. తాజాగా బిగ్బాస్ హౌస్ లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా అభిమానులకు నెటిజన్స్ కీ ఒక ఊహించని షాక్ ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ ఇస్ తో సైలెంట్ గా నిశ్చితార్థం జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇదేం ట్విస్ట్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది సోనియా. యష్ తో తనకు మూడేళ్ల పరిచయం ఉందని, బిగ్ బాస్ కి వెళ్లేముందే వివాహం చేసుకోవాలనుకున్నాని తెలిపింది. అయితే బిగ్ బాస్ ఛాన్స్ వదులు కోకూడదని స్వయంగా యష్ నే తనను రియాలిటీ షోకి పంపాడని కూడా చెప్పుకొచ్చింది.