Zebra: విభిన్నంగా సత్యదేవ్‌ ‘జీబ్రా’

Zebra: టాలెంటెడ్‌ యాక్టర్‌ సత్య దేవ్‌, కన్నడ స్టార్‌ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్‌ మల్టీ స్టారర్‌ ’జీబ్రా’ ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మించారు. ప్రియా భవానీ శంకర్‌, జెన్నిఫర్‌ పిషినాటో హీరోయిన్స్‌ గా నటించారు.

తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీబ్రా..అనేది బ్లాక్‌ అండ్‌ వైట్‌ కి మెటాఫర్‌. బ్లాక్‌ మనీ, వైట్‌ మనీ చుట్టూ జరిగే కథ ఇది. అలాగే చివరివరకూ ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలీదు. ప్రతి ఒక్కరిలో గ్రే వుంటుంది. అందుకే టైటిల్‌ ఫాంట్‌ కి గ్రే పెట్టి, సినిమాకి జీబ్రా అనే టైటిల్‌ పెట్టారు. తెలుగు సినిమా ప్రేక్షకుల కోరిక నెరవేరినట్లు తెలుస్తోంది.

Zebra: సత్య దేవ్ ‘జీబ్రా’ నవంబర్ 22న థియేట్రికల్ రిలీజ్

ఎంతో టాలెంట్‌ ఉన్న యాక్టర్‌ సత్యదేవ్‌ కి రావాల్సినంత సక్సెస్‌ రాలేదు అనేది వాస్తవం. ’జీబ్రా’ మూవీతో ఆయన ఆ సక్సెస్‌ ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌ ట్విట్టర్‌ వేదికగా సినిమాకి పాజిటివ్‌ రివ్యూస్‌ కనిపిస్తున్నాయి. మంచి కంటెంట్‌ తో దర్శకుడు ఎంగేజింగ్‌ గా కథని చూపించడంలో సక్సెస్‌ అయినట్లు తెలుస్తోంది.

ఇక యాక్టింగ్‌ లో ఎప్పటిలాగానే సత్యదేవ్‌ తో పాటు ధనుంజయ అదరగొట్టారు అంటున్నారు. కథని ఈశ్వర్‌ కార్తీక్‌ చాలా బ్రిలియంట్‌ గా రాశారంటూ పొగడ్తలతో ముంచేస్తునారు. కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్లర్‌, యాక్షన్‌ అన్ని విభాగాల్లోనూ సినిమాకి పాజిటివ్‌ మార్కులు వేస్తున్నారు. ఇక ధనంజయ క్యారెక్టరైజేషన్‌ అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇక మరికొందరు సినిమా ఫస్ట్‌ హాఫ్‌ ఓకే, సెకండాఫ్‌ బ్లాక్‌బస్టర్‌ అంటూ రివ్యూలు ఇస్తున్నారు.

పవన్,బొత్స మాటల యుద్ధం || Pawan Kalyan Vs Bosta Satyanarayana || Pawan Kalyan Counter To Bosta || TR