Rajamouli: భావోద్వేగ సన్నివేశాలు మలిచి ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేయడంలో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సిద్ధహస్తుడు. అందుకే ఆయన తీసే సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఎమోషనల్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్ సీన్స్ తీయడంలో ఆయనది ప్ ప్రత్యేకమైన శైలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ రామ్‌చరణ్ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకుంది.
అందులోని ఓ సన్నివేశం భావోద్వేగభరితంగా రావడానికి చిరంజీవి నటించిన ’కొదమ సింహం’ చిత్రమే కారణమని రాజమౌళి ఓ సందర్భంలో పంచుకున్నారు. చిరంజీవి ‘కొదమసింహం’ మూవీలో రౌడీలు చిరును పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోగా… అక్కడే ఉన్న ఆయన గుర్రం ఆయన నోటికి తాడు అందించి కాపాడుతుంది.
Kodama Simham – Magadheera
అయితే, ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చిన ఆయనకు, గుర్రానికీ అనుబంధం లేదని రాజమౌళి భావించారు. అందుకే ‘మగధీర’లో ఇసుక ఊబిలో కూరుపోయిన చరణ్ బయటకు వచ్చిన తర్వాత తన గుర్రాన్ని కౌగలించుకుంటాడు. ఒక స్నేహితుడిలా చూస్తూ దానితో కృతజ్ఞత భావంతో మాట్లాడతాడు.
అలా నా సినిమాల్లో బలమైన సన్నివేశాలు ప్రేక్షకుల ఆలోచనల నుంచి స్ఫూర్తి పొంది రాసినవే ఉంటాయి‘ అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి ఎంబి 29 పనుల్లో బిజీగా ఉన్నారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో రూపొందుతున్న ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ మహేశ్‌బాబు కనిపించని సరికొత్త అవతారంపై దర్శనమివ్వనున్నారు.