మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల దేవుడి ఫోటోలతో పాటు విగ్రహాలను కూడా ఇంట్లో ఉంచి ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు. దేవుడి విగ్రహాలను ఇలా పూజించటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. అయితే దేవుడి విగ్రహాలను ఇంట్లో ఉంచి పూజించేటప్పుడు కొన్ని రకాల లోహాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించటం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయి. అందువల్ల ఎలాంటి విగ్రహాలను పూజించాలి ? ఎలాంటి విగ్రహాలను పూజించకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా బంగారం, వెండి , ఇతడితో తయారు చేసిన విగ్రహాలను పూజ గదిలో ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇలాంటి విగ్రహాలను పూజించటం వల్ల ఆ పూజ ఫలితం లభిస్తుంది. అయితే ఇనుము, అల్యూమినియం, ఉక్కు వంటి లోహాలతో తయారు చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించకూడదు. వీటిని దేవుడి గదిలో ఉంచి పూజించటం అశుభ సంకేతం. అటువంటి విగ్రహాలను పూజించడం వల్ల ఇంట్లో ఆర్ధిక, ఆరోగ్య సమస్యలతో పాటు అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
అంతే ఇంట్లో విగ్రహాన్ని ఉంచి పూజించడానికి విగ్రహానికి ఉపయోగించే లోహం మాత్రమే కాదు ఎత్తు కూడా ముఖ్యం. దేవుడి విగ్రహాలు ఇంట్లో ఉంచి పూజించాలి అనుకునేవారు కేవలం మన బోటలివేలు పొడవు ఉండే విగ్రహాలను మాత్రమే పూజించాలి. అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను పూజించకూడదు. ఇలా బంగారు వెండి రాగి తో తయారుచేసిన చిన్న విగ్రహాలను మాత్రమే ఇంట్లో ఉంచి పూజించడం వల్ల పూజ చేసిన ప్రతిఫలం మనకు లభిస్తుంది. ఇతర లోహాలతో తయారు చేసిన విగ్రహాలను పొరపాటున కూడా ఇంట్లో ఉంచి పూజించరాదు.