వంటగదిలో ఉన్న నల్లా లీక్ అయితే కుటుంబంలో ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా..?

మన హిందూ పురాణాల ప్రకారం వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో ఉన్న నియమాలను పాటించకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అందువల్ల దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా కూడా వాస్తు శాస్త్రం పట్ల ప్రజలకి చాలా విశ్వాసం ఉంది. అందుకే వాస్తు శాస్త్రంలో వివరించబడిన నియమాలను పాటిస్తూ ఉంటారు. నూతన గృహాన్ని నిర్మించడానికి మాత్రమే కాకుండా ఇందులో వస్తువులు అమర్చటానికి కూడా వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి వంట గదిలో ఉన్న నల్ల నుండి నీరు వృధాగా కారిపోతున్న కూడా ఎన్నో దుష్పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుంది.

ఇంటి వంటగదిలో మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న ఏ కులాయి నుంచి కూడా నీరు వృధాగా కారిపోకూడదు. ఇలా మీరు వృధా అవుతుంటే ఇంట్లో దుబారా ఖర్చు ఎక్కువవుతున్నట్లు అర్థం ముఖ్యంగా వంట గదిలో ఉండే నళ్లా లీక్‌ అయితే ఆ కుటుంబంలో ఆర్థికంగా పురోగతి ఉండదని వాస్తు శాస్త్రంలో సూచించబడింది. ఎందుకంటే వంట గది అగ్నికి కేంద్రంగా చెబుతారు. ఇలా అగ్ని, నీరు కలయిక వల్ల మనిషికి అనేక సమస్యలు ఎదురవుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో నీరు వృధాగా కారిపోవటం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యలు ఎదురవటమే కాకుండా భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.

అందువల్ల పొరపాటున కూడా ఇంట్లో నీరు వృధా కాకుండా చూసుకోవాలి…లేదంటే కుటుంబసభ్యులకు అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అంతె కాకుండా ఆ గంగాదేవి ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. దీంతో వ్యాపారంలో విపరీతమైన నష్టాలు, ఇంట్లో సంతోషం కరువవడం, డబ్బు వృథా అవుతుంటాయి. ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా నీరు ప్రవహిస్తుంటే అది నెగిటివ్‌ ఎనర్జీకి దారి తీస్తుంది. ఇంట్లో నీరు ఇలా లీక్‌ అవుతుందంటే వెంటనే రిపేర్‌ చేయించుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.