ఆమీర్ ఖాన నటించిన దంగల్ హిందీ సినిమా చూశారా? చాలా ఉత్తేజం కలిగించే సినిమా ఇది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ వర్షం కురిపించింది.
ఒక పల్లెటూరి తండ్రి,వూర్లో కట్టుబాట్లను ఎదిరించి తన కూతుర్లను రెజ్లర్స్ గా మార్చి, కూతుర్లను ఎలా పెంచి పెద్ద చేసి ప్రయోజకుల చేయాలో చూపించారు. ఈ క్రమంలో తండ్రి (సినిమాలో ఆమిర్ ఖాన్ ) ఎన్నికష్టాలు,అవమానాలు పడతారో సినిమాలో బాగా చూపించారు.
కేవలం ‘మగాళ్ల’ ఫీల్డయిన రెజ్లింగ్ లోకి కూతుర్లను దించి మగాళ్లను ఎదిరించి ప్రశంసలందుకుని పనికిరాని కట్టుబాట్లను తెంచేయడంలో ఒక వూర్లో, ఒక కుటుంబంలో, ఒక తండ్రిలో జరిగే ఈ సంఘర్షణని ఆమిర్ ఖాన్ దంగల్ లో గొప్పగా చూపించాడు.
అన్నింటికంటే ముఖ్యంగా , కూతుర్లను మగవాళ్లతో సమానంగా పెంచడమే కాదు, వాళ్లని ఎదిరించే స్థాయికి తీసుకురావడంలో , కూతుర్లను ఏ కొశాన తక్కువ చూడకండా పెంచడంలో దంగల్ తండ్రిలో కనిపిస్తుంది. ఇలాంటి ధీమ్ ఆమిర్ ఖాన్ బుర్రనుంచి రాలేదు.
ఇదంతా నిజంగా ఒక వూర్లో, ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘర్షన. దంగల్ కథ జరిగిన వూరు హర్యానాలోని బలాలి గ్రామం. కూతుర్లను మహారాణుల్లాగా పెంచి పెద్ద చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన పాత్ర నిజ జీవితంలో ‘సూపర్ డ్యాడ్’ మహావీర్ సింగ్ ఫోగత్ ది.
హర్యానాలో మిగతా రాష్ట్రాల కన్నా మొగోళ్లు ఎక్కువ. అక్కడ సెక్స్ రేషియో 879 (2011 జనాభా లెక్కలు). అంటే ప్రతి వేయి మంది పురుషులకు అక్కడు ఉన్న స్త్రీలు 879 మంది మాత్రమే. మహిళల అక్ష రాస్యత 65.94 శాతం. కఫ్ పంచాయతీల వంటి ఆదిమ సంప్రదాయాలున్న రాష్ట్రం. పరువు హత్యలు విపరీతం.
ఇలాంతి మహావీర్ సింగ్ ఫోగత్ తనకు ఆరుగురు కూతుర్లను మగవాళ్ల వినోద క్రీడ అయిన రెజ్లింగ్ లో శిక్షణ ఇవ్వాలనుకున్నాడు. వారి పేర్లు గీత, బబిత, రీతు, సంగీత. వినేష్, ప్రియాంక. వీరిలో మొదటి ముగ్గురు ఆయన సొంతకూతుర్లు. మిగతావారు ఎపుడో చనిపోయిన ఆయన సోదరుని కూతుర్లు. గీత బిబితాలకు మగపిల్లలతో కలసి ట్రెయినింగ్ ఇచ్చారు. దీని మీద చాలా వ్యతిరేకత వచ్చింది.
ఇందులో గీతా ఫోగత్ ఒలింపిక్స్ క్వాలిఫై అయిన తొలి మహిళా రెజ్లర్ అయింది. రెండో కూతురు బబితాకుమారి ఫోగత్ 2012 లో ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో బ్రాంజ్ పథకం సాధించింది. తర్వాత ఆమె 2014 కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించింది. వినీష్ ఫోగత్ కూడా కామన్ వెల్త్ గోల్డ్ సాధించింది. 2018 ఏషియన్ గేమ్స్ లో కూడా ఆమె స్వర్ణ పథకం సాధించింది. మహిళలను రెజ్లింగ్ కుపరిచయం చేసి వారిని విజేతలుగటా తీర్చి దిద్దడంలో విజయవంతమయినందుకు ఫోగత్ ద్రోణాచార్య అవార్డు లభించింది. ఈ నిజజీవిత వీరగాథమే దంగల్ సినిమాకు ప్రేరణ.
అసలు విషయం ఏంటంటే, ఫోగత్ ఇపుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన అజయ్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జన్ నాయక్ జనతా పార్టీ (జెజెపి)లో చేరారు. హర్యానా యువతను క్రీడలవైపు మళ్లించడం ఈ పార్టీ లక్ష్యాలలో ఒకటి .అ ందుకే పార్టీలో క్రీడా విభాగం ఏర్పాటుచేసి దానికి ఫోగత్ ను ఇన్ చార్జ్ చేశారు. అంతేకాదు, ఆయనకు హర్యాన యువతీ యువకుల్లో విపరీతమయిన పేరు ఉండటంతో పార్టీ కోర్ కమిటీలోకి కూడా తీసుకున్నారు. ఎన్నికల్లో క్రీడల స్ఫూర్తి ని ప్రచారం చేందుకు ఆయన్ని పోటీ పెట్టించాలని కూడా పార్టీ నిర్ణయించింది. దంగల్ సినిమా తెచ్చిన పేరు, ఫోగత్ వ్యక్తిగత జీవితం, ఆయన కూతుర్లు తీసుకువచ్చిన అంతర్జాతీయ కీర్తి వల్ల ఎన్నికల్లో గెలవచ్చని జెజెపి భావిస్తున్నది. జీవితం, సినిమా, రాజకీయాలు ఇక్కడ కలసిపోతున్నాయి. జీవితం సినిమాలో విజయవంతమయింది. అయితే, అదే జీవితం రాజకీయాల్లో స్ఫూర్తి నిస్తుందా? వేచి చూడాల్సిందే.