ఇండియాలో బ్యాంకులను ముంచేయడం చాాలా సులభం. కాకపోతే ముంచాలనుకునే టప్పటకి మీరు పెద్ద మనిషై ఉండాలి. అపుడు వ్యవహారం తెలిగ్గా పూర్తవుతుంది.
2017 -18 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రు. 42,167 కోట్లకు దేశంలో ని బ్యాంకులను పెద్ద మనుషులు ముంచేశారు.ఈ వివరాలను రిజర్వు బ్యాంకే వెళ్లడించింది. బ్యాంకులలో ఎంత కఠినంగా రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నా మోసగాళ్లు దర్జాగా తమ పని కానిచ్చేశారని రిజర్వు బ్యాంకు పేర్కొంది.
ఇలా బ్యాంకులను బోల్తా కొట్టించడం ప్రతి సంవత్సరం ఎక్కువుతూ ఉందని మరీ పచ్చి నిజం చెప్పి మన అల్పజీవులను బ్యాంకు లంటే భయపడేలా చేసింది పెద్ద బ్యాంకు. 2016-7 జరిగిన మోసాలతో పోలిస్తే 2017-18లో మోసాలు చాలా బాగా… అంటే 72 శాతం పెరిగాయి. ఆ యేడాది బ్యాంకులు మునిగింది రు. 23,933 కోట్లకే. అదే, ఒక ఏడాదిలో 42 వేల కోట్లకు పెరిగిందంటే మన బ్యాంకులు ఎటువోతున్నాయో చెప్పవచ్చు.
రిజర్వు బ్యాంకు విడుదల చేసిన సమాచారం ప్రకారం 2017-18లో మొత్తం 5917 సార్లు బ్యాంకులను బోల్తా కొట్టించారు. అంతకు ముందు సంవత్సరం ఇలాంటి మోసాలు కేవలం 5076 మాత్రమే జరిగాయి.దీని బట్టి బ్యాంకులను మోసగించడంలో కొంతమంది ఆరితేరుతున్నారని అర్థమవుతుంది. వీళ్ల సంఖ్య ఏయేటి కాయేడు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా గత నాలుగేళ్లలో ఇది బాగా పెరిగింది. 2013-14లో మోసాల వల్ల బ్యాంకులు నష్టపోయిందెంతో తెలుసా? కేవలం రు. 10,170 కోట్లు మాత్రమేని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది.
ఈ మొత్తం మోసాలలో పెద్ద పెద్ద మోసాలే ఎక్కువగా ఉన్నాయని రిజర్వు బ్యాంకు చెప్పింది. బ్యాంకులకు టోపీ పెట్టిన కేసులలో 80 శాతం లార్జ్ వాల్యూ మోసాలే.అంటే రు. 50 కోట్లు ఆ పై మొత్తాలున్న మోసాలే.