OnePlus 11R: 40 వేల వన్ ప్లస్ ఫోన్ కేవలం 28 వేలకే.. ఫీచర్స్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్ అలాగే ఫ్లిప్‌కార్ట్‌ లలో భారీ సేల్‌ నడుస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది వన్ ప్లస్. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా ఇలాంటి కొన్ని ఆఫర్లు అందిస్తోంది. భారీ డిస్కౌంట్లతో స్మార్ట్‌ ఫోన్‌లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయచ్చు. మీరు అమెజాన్ లో వన్ ప్లస్ 11R కొనుగోలు చేయడం ద్వారా కూడా మంచి డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.28,000 కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్‌ అసలు ధర రూ. 39,999 కావడం విశేషం.

అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ను కొనుగోలుపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి. తక్కువ ధరకే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకున్న వారికి అమెజాన్ డీల్ ఉపయోగకరంగా ఉంటుంది. మీరు డిస్కౌంట్ ఆఫర్‌లు, ప్రైమ్ బెనిఫిట్స్, బ్యాంక్ ఆఫర్‌లతో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఈ వన్ ప్లస్ స్మార్ట్‌ ఫోన్‌ల తగ్గింపు ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. OnePlus 11R అమెజాన్‌లో రూ. 30,750కి అందుబాటులో ఉంది. మీరు ప్రైమ్ మెంబర్ అయితే, మీరు 5% ప్రైమ్ సేవింగ్స్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

ఇది కాకుండా, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అమెజాన్ పేలో విడిగా 5% తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లన్నింటి తర్వాత, OnePlus 11R ధర రూ. 27,750 వస్తుంది. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్ కాకపోతే, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా రూ.1,250 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ.29,499కే పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.28,000 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. ఇకపోతే ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ ల విషయానికి వస్తే.. 11R 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2772×1240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ని కలిగి ఉంటుంది. ఇది కాకుండా 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ , 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్‌తో రన్ అవుతుంది. వన్ ప్లస్ 11R 100 SUPERVOOC ఛార్జింగ్ టెక్నాలజీ, 50ఎంపీ +8ఎంపీ +2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది.