ప్రజాసంకల్ప యాత్రను విజయవంతంగాపూర్తి చేసుకున్న వైసిపి అధినేత,ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 10 న తిరుమలకు వస్తున్నారు. జనవరి 9 వతేదీన ఇచ్చాపురంలో ప్రజాసంకల్ప యాత్ర పూర్తవుతుంది. అనంతరం ఆయన తిరుపతి బయలు దేరుతారు. ఈ నెల 10న కాలిబాట లో తిరుమల కు చేరుకుంటారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. 2017 నవంబర్ 3 న ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభానికి ముందు కూడా జగన్ తిరుమలేశుని సందర్శించుకున్నారు. ఇపుడు 14 నెలల పాదయాత్ర అనంతరం మళ్లీ ఆయన తిరుమల వస్తున్నారు.
కాలిబాటన తిరుమల కొండెక్కనున్న జగన్
