వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతుందనే చెప్పాలి. అమరావతినే రాజధానిగా చేస్తారని నమ్మిన రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంశానికితెర తీసింది. రాజధానిగా అయితే తమ బతుకులు మారుతాయని నమ్మిన రైతులు వైసీపీ నిర్ణయం వల్ల తీవ్ర భయానికి గురి అవుతున్నారు. తమను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని అమరావతి రైతులు అమరావతి రైతులు ధర్నా చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ అమరావతి రైతుల సెగ గన్నవరం రైతులను కూడా తాకింది. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి భూములు ఇవ్వమని రైతులు చెప్తున్నారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్యాకేజీ అమలుకాకపోవడంతో పునరాలోచనలో పడ్డ గన్నవరం రైతులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్నారు.
విమానాశ్రయ విస్తరణకు భూములివ్వబోమని స్పష్టం చేసిన గన్నవరం రైతులు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలోనే రాజధాని ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. విమానాశ్రయ విస్తరణకు లేకుండా 700 ఎకరాలు టీడీపీ ప్రభుత్వం సేకరించింది. అయితే భూములిచ్చిన రైతులు ఇప్పుడు మళ్ళీ తమ భూముల్లో వ్యవసాయం ప్రారంభించారు. ఎందుకంటే ఇప్పుడు రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు కానీ ఇప్పుడు ప్రభుత్వం యొక్క మూడు రాజధానుల అంశం వల్ల అక్కడ అభివృద్ధి కూడా కుంటూ పడింది. ఈ అభివృద్ధి అనే అంశం ఇప్పుడు గన్నవరం రైతులను కూడా వెంటాడుతోంది. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయకపోతే గన్నవరం అభివృద్ధి కూడా సాధ్యం కాదని భావించిన రైతులు ఇప్పటికే గన్నవరంలో తమ భూముల్లో వ్యవసాయం ప్రారంభించారు.
విమానాశ్రయ విస్తరణకు భూములు అప్పగించాలని జిల్లా కలెక్టర్ కు ఎయిర్‍పోర్టు డైరెక్టర్ ఒక లేఖ కూడా రాశారు. అధికారులు చెప్తున్నా కూడా రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని సమాచారం. అమరావతి రైతుల యొక్క ఉద్యమ సెగ గన్నవరం వరకు పాకింది. ప్రజల్లో వైసీపీ పతనం గన్నవరం నుండే స్టార్ట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వమే అడుగుతున్నా కూడా రైతులు భూములు ఇవ్వడం లేదంటే ఇది పతనానికి సంకేతమేనని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.