రాజధాని లేకుండా ఐదేళ్ల పాలన.. జగన్ చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదే!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల గురించి ప్రకటన చేయడంతో ప్రజలు ఎంతగానో సంతోషించారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల రాష్ట్ర అభివృద్ధి సులభంగా జరుగుతుందని చాలామంది భావించారు. అయితే జగన్ మాత్రం రాజధాని లేకుండా ఏపీని ఐదేళ్ల పాటు పాలించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజధాని విషయంలో జగన్ రాబోయే రోజుల్లో తీవ్రస్థాయిలో విమర్శలు మూటగట్టుకునే ఛాన్స్ అయితే ఉంది.

అమరావతినే రాజధానిగా ప్రకటించి ఉంటే ఈపాటికి అమరావతి స్వరూపాలు మారిపోవడంతో పాటు అక్కడి ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరేది. రాజధాని ఏర్పాటు అంతకంతకూ ఆలస్యం కావడం వల్ల ఏపీ అభివృద్ధి కూడా ఆలస్యమయ్యే ఛాన్స్ అయితే ఉంది. జగన్ మూడు రాజధానుల నిర్ణయం వల్ల విశాఖ తప్ప అమరావతి, కర్నూలులకు పెద్దగా బెనిఫిట్ కలిగే అవకాశం అయితే లేదు.

విశాఖకు బదులుగా అమరావతి నుంచి పాలన సాగించే దిశగా జగన్ అడుగులు వేసి ఉంటే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రాయలసీమ వాసులకు విశాఖ రాజధాని కావడం వల్ల పెద్దగా బెనిఫిట్ కలగదు. రాయలసీమ జిల్లాల నుంచి విశాఖకు ఉన్న రైళ్ల సంఖ్య కూడా చాలా తక్కువనే సంగతి తెలిసిందే. రాయలసీమ వాసులకు రోడ్డుమార్గం ద్వారా కూడా విశాఖతో పోల్చి చూస్తే హైదరాబాద్ దగ్గరనే సంగతి తెలిసిందే.

ఏపీ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లినా వైసీపీకి అనుకూలంగా తీర్పు రావడం సులువు కాదు. సుప్రీం కోర్టు కూడా అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలని చెబితే వైసీపీ పరిస్థితి ఏంటని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ రాజధాని విషయంలో ఆలస్యం చేయడం ఏ మాత్రం మంచిది కాదని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. రాజధాని విషయంలో ఆలస్యం చేయడం జగన్ చేస్తున్న అతిపెద్ద తప్పు అని కామెంట్లు వినిపిస్తున్నాయి.