బాకృష్ణ , విజయ శాంతితో చిరంజీవి మళ్ళీ జత కడతాడా ..?

తెలంగాణాలో ఎన్నికల నగారా మ్రోగింది . నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ , డిసెంబర్ 7 న ఎన్నికలు . ఎలక్షన్ కమిషన్ ప్రకటన వెలువడింది . ఇప్పటికే టీఆరెస్ , కాంగ్రెస్ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు , కాంగ్రెస్ పార్టీ నాయకులూ తీవ్రమైన మాటల తూటాలను ప్రయోగిస్తున్నారు . ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రకటన వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ  ఈ ఎన్నికల్లో  ఎలాగైనా విజయ సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నారు . కాంగ్రెస్ పార్టీతో తెలుగు దేశం పార్టీ కూడా జత కడుతుంది . అయితే ఈ రెండు పార్టీల్లో వున్న స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, విజయ శాంతి తో పాటు మరికొంత మంది సినిమా వారిని ప్రచార రంగంలోకి దించాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది .

ఇప్పటికే బాలకృష్ణ, విజయ శాంతి ప్రచారం మొదలు పెట్టారు . చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే వున్నారు . ఆయన  ప్రస్తుతం తన 151వ చిత్రం “సైరా
నరసింహారెడ్డి ” షూటింగ్ కోసం జార్జియా లో వున్నాడు . ఒక వారం రోజుల్లో హైదరాబాద్ రావచ్చు . చిరంజీవి , బాలకృష్ణ మంచి స్నేహితులు, విజయ శాంతి అటు బాలయ్య , ఇటు చిరంజీవితో కూడా నటించింది . ఈ ముగ్గురు ఒకరంటే మరొకరికి సదాభిప్రాయమే వుంది . కాబట్టి ముగ్గురిని ఒకే వేదిక పైకి తీసుకొస్తే ఎలా వుంటుందనే ఆలోచన కాంగ్రస్ పార్టీకి వచ్చిందట. ఇదే విషయమై  స్టార్ కాంపైనర్ విజయ శాంతితో మాట్లాడుతున్నట్టు తెలిసింది .

విజయ శాంతి , బాలకృష్ణ ఒకే వేదికపైకి వచ్చే అవకాశం వుంది . కాంగ్రెస్ పార్టీ తో పాటు తెలుగు దేశం పార్టీ కూడా చంద్ర శేఖర్ రావును ఎలాగైనా ఓడించాలని కృత నిశ్చయం తో వుంది . చంద్ర శేఖర్ రావు చంద్ర బాబును టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలకు బాలకృష్ణ కూడా మండిపడుతున్నట్టు తెలుగు దేశం వర్గాలు తెలియ జేస్తున్నాయి . బాలకృష్ణ కూడా  తన ప్రచారానికి తగ్గట్టు షూటింగ్ ప్లాన్  చేసుకొనే ఉద్దేశ్యం తో వున్నాడట .  బాలకృష్ణ విజయ శాంతి ఎక్కువ వేదికలమీద ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి .

ఇక ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కు తెలుగు దేశానికి పడటం లేదు . పవన్ కళ్యాణ్ కూడా చంద్ర బాబును టార్గెట్ చేస్తున్నాడు . ఈ పరిస్థితుల్లో చిరంజీవి బాలకృష్ణ  విజయ శాంతితో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవచ్చు . ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ , తెలుగు దేశం కలసి పోటీ చేస్తున్నాయి . కాబట్టి చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంవల్ల పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికర పరిస్థితిఏర్పడ వచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేసి ఎలాగైనా చిరంజీవిని ఒప్పిస్తామనే ధీమాతో వున్నారు . చిరంజీవి ప్రచారం చేస్తాడా ? సారీ అని తప్పించుకుంటాడా ?